మెగాస్టార్ – లేడీ సూపర్ స్టార్ రీయూనియన్

Megastar Chiranjeevi And Lady Superstar Vijayashanthi Re-Union

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా వుంది. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే రోజుకో సర్‌ప్రైజ్‌ను విడుదల చూస్తూ ప్రేక్షకులను, అభిమానులను థ్రిల్ చేస్తున్నారు. ఇక నిన్న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో వైభ‌వంగా నిర్వ‌హించిన‌ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమా ట్రయిలర్ ను కూడా రిలీజ్ చేసారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నిన్న జరిగిన ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ ఎవరంటే.. మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి అని చెప్పొచ్చు. ఈ ఈవెంట్ ద్వారా ఎన్నో ఏళ్ళ తర్వాత వీరిద్దరినీ ఒకే వేదికపై చూసే అవకాశం దక్కింది. ఇక ఈ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ..తన స్పీచ్‌తో నవ్వుల పూవులు పూయించారు. ఈ చిత్రంలో కీలకపాత్రలో నటించిన లేడీ సూపర్ స్టార్ విజయశాంతితో మెగాస్టార్‌కి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లారు. విజయశాంతితో తనకు ఎమోషనల్ రిలేషన్ ఉందని చెప్పారు. కుటుంబసభ్యుల్లా కలిసి వుండేవాళ్లమని తెలిపారు. ‘ఈరోజు సండే.. నాతో ఆరోజు ‘సండే అననురా.. మండే అననురా ఎన్నడు నీదాన్నిరా’ అని అప్పట్లో నాకు మాట ఇచ్చిన మనిషి నా బ్లాక్ బస్టర్స్ హిట్ పెయిర్ విజయశాంతి. మేం ఇద్దరం ఎలా ఉండేవాళ్లం అంటే హీరో హీరోయిన్లులా కాదండీ.. టీ నగర్‌లో మా ఇంటి ఎదురుగానే ఉండేది. ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే.. మా ఇంటికి తను వచ్చేది తన ఇంటికి నేను వెళ్లేవాడిని. ఇక సినిమాల పరంగా 19-20 సినిమాలు కలిసి చేశాం. ఎంత హుషారుగా ఎంత సరదాగా చేసే వాళ్లం అంటే.. మళ్లీ మళ్లీ చేయాలనిపించేది.అయితే విజయశాంతి నీ మీద నాకు చిన్న కోపం ఉందని చిరంజీవి అనగా.. ఎందుకు అని విజయశాంతి చిరంజీవి పక్కకు వచ్చి అడిగారు. ‘నాకంటే ముందు నువ్ పాలిటిక్స్‌కి వెళ్లావ్ కదా.. అప్పట్లో నన్ను అన్ని మాటలు అన్నావ్.. నీకు ఎలా మనసు వచ్చింది’ అని చిరంజీవి అనగడంతో స్టేజ్ అంతా నవ్వులతో నిండిపోయింది. అంతే కాదు 13 ఏళ్ల తర్వాత విజయశాంతిని చేస్తుంటే.. ఆమెలో అదే పొగరు, అదే ఫిగరు అంటూ చమత్కరిస్తూ కామెడీ చేశారు.

మరి ఏదిఏమైనా ఇన్నేళ్ల తర్వాత మెగా స్టార్, లేడీ సూపర్ స్టార్ ఇలా రీ యూనియన్ అవ్వడం ఆనందించతగ్గ విషయమే. నా హీరోయిన్, నా హీరో అంటూ తమ స్నేహ బంధాన్ని గుర్తు చేసుకుంటూ… అందరినీ మరిచి తమ ఫ్రెండ్‌షిప్‌ గురించి మాట్లాడుకున్నారు. వీరి మాటల్లో కొన్ని పంచ్ డైలాగ్‌లు ఉన్నప్పటికీ.. ఈ ఇద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్ అందరినీ ఆకట్టుకుంటోంది. స్క్రిప్ట్‌ లేకపోయినా.. సినిమాకు మించిన అద్భుత డైలాగ్‌లు వారి మాటల్లో బయటపడ్డాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × four =