ఏ పరిశ్రమలోనైనా కలిసొచ్చిన తారలతో వరుస సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. ప్రస్తుతం అలాంటి వాతావరణం తెలుగునాట కాస్తంత ఎక్కువగానే కనిపిస్తుంది. ముఖ్యంగా… కొందరు దర్శకులు ప్రస్తుతం తమ కొత్త చిత్రాల కోసం కలిసొచ్చిన కథానాయికలతో వరుసగా రెండో సారి కలసి పనిచేస్తుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. తాజాగా… `రాజా ది గ్రేట్` కథానాయిక మెహరీన్‌ని `ఎఫ్ 2`కోసం రిపీట్ చేసి హిట్ కొట్టాడు అనిల్ రావిపూడి. అలాగే… గత చిత్రం `నేనే రాజు నేనే మంత్రి`లో నాయికగా నటించిన కాజల్ అగర్వాల్ తో తన కొత్త చిత్రం `సీత`ని రూపొందిస్తున్నాడు తేజ. వాస్తవానికి… కాజల్ తొలి చిత్రం `లక్ష్మీ కళ్యాణం`కి దర్శకుడు తేజ కావడం గమనార్హం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తన ప్రీవియస్ మూవీ `జై లవ కుశ`లో ఓ హీరోయిన్‌గా నటించిన రాశీ ఖన్నానే తదుపరి చిత్రం `వెంకీ మామ`లోనూ ఇద్దరు హీరోయిన్స్‌లో ఒకరిగా ఎంచుకున్నాడు మరో టాలెంటెడ్ డైరెక్టర్ కె.ఎస్.రవీంద్ర (బాబీ). ఇందులో వెంకటేష్‌కి జోడీగా పాయల్ రాజ్‌పుత్ నటిస్తుండగా… నాగచైతన్యకి జోడీగా రాశి నటిస్తోంది. అలాగే…`అరవింద సమేత` తరువాత త్రివిక్రమ్ రూపొందిస్తున్న కొత్త చిత్రం(అల్లు అర్జున్ హీరో)లోనూ పూజా హెగ్డే పేరు ఓ హీరోయిన్ గా వినిపిస్తుండగా… `సమ్మోహనం` తరువాత ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందిస్తున్న చిత్రంలో అదితి రావ్ హైదరీ నాయికగా నటించనుందని కథనాలు వినిపిస్తున్నాయి. మరి… ఆల్రెడీ కలిసొచ్చిన నాయికలతో వరుసగా రెండో సినిమాలు చేస్తున్న ఆయా దర్శకులు.. రెండోసారి కూడా మంచి విజయాలను అందుకుంటారేమో చూడాలి.
[youtube_video videoid=W0opRq_b8UU]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: