సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌లా నిలచిన చిత్రం `ఒక్కడు`. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఎమ్మెస్ రాజు నిర్మించారు. భూమిక కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, ముఖేష్ రుషి, గీత, రాజన్ పి.దేవ్, అజయ్, చంద్రమోహన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. మణిశర్మ సంగీత సారథ్యంలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. ముఖ్యంగా `చెప్పవే చిరుగాలి`, `నువ్వేం మాయ చేశావోగానీ` పాటలు చార్ట్‌బస్టర్స్‌గా నిలచాయి. ఇక సందర్భానుసారంగా వచ్చే `సాహసం శ్వాసగా సాగిపో ` పాట చిత్ర కథను ప్రతిబింబిస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 15, 2003న విడుదలైన `ఒక్కడు`… నేటితో 16 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒక్కడు – కొన్ని విశేషాలు:
* సంగీత దర్శకుడిగా మణిశర్మ 50వ చిత్రమిది. ఈ సినిమాకి ఆయన అందించిన బాణీలతో పాటు నేపథ్య సంగీతం కూడా చిత్ర విజయంలో ముఖ్య భూమిక పోషించింది.
* 2003కి గానూ `ద్వితీయ ఉత్తమ చిత్రం`, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ ఛాయాగ్రాహకుడు (శేఖర్ వి.జోసెఫ్), ఉత్తమ ఎడిటర్ (ఎ.శ్రీకర్ ప్రసాద్), ఉత్తమ కళా దర్శకుడు (అశోక్ కుమార్), ఉత్తమ కొరియోగ్రాఫర్ (రాజు సుందరం), ఉత్తమ ఫైట్ మాస్టర్ (విజయన్).. విభాగాలలో `ఒక్కడు` సినిమాకి `నంది` అవార్డులు వరించాయి. దీన్ని బట్టి… `ఒక్కడు` సాంకేతికంగా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
* తమిళంలో ఈ చిత్రాన్ని `గిల్లి` (విజయ్, త్రిష) పేరుతోనూ… కన్నడలో `అజయ్` (పునీత్ రాజ్ కుమార్, అను మెహతా) పేరుతోనూ… హిందీలో `తేవర్` (అర్జున్ కపూర్, సోనాక్షి సిన్హా)పేరుతోనూ ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమా మంచి విజయం సాధించింది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: