మెగా కాంపౌండ్ హీరో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా `చిత్ర లహరి`. `నేను శైలజ`, `ఉన్నది ఒకటే జిందగీ` ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. సాయిధరమ్ తేజ్ సరసన `హలో` ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ కథానాయికలుగా నటిస్తున్నారు. యువ సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ బాణీలను అందిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాని వేసవి కానుకగా ఏప్రిల్ 12 న విడుదల చేస్తామని ఈ చిత్ర దర్శక నిర్మాతలు ప్రకటించారు. కొంతకాలంగా సరైన విజయం లేని సాయిధరమ్ తేజ్ కు ఈ సినిమా విజయం చాలా కీలకంగా మారింది. `చిత్ర లహరి`తోనైనా ఈ మెగా కాంపౌండ్ హీరో బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: