స్వాగ్ లో మహారాణి రుక్మిణిదేవి గా రీతూవర్మ

ritu varma poster released from swag movie

హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా కొత్త సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో రాజరాజచోర సినిమా వచ్చింది. ఆ సినిమా మంచి హిట్ నే అందించింది. ఇక ఈసినిమా టైటిల్ ను రీసెంట్ గానే ప్రకటించారు. స్వాగ్ అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈసినిమా నుండి క్రేేజీ అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమాలో నటిస్తున్న హీరోయిన్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. రీతూవర్మ ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అయితే రీతూవర్మ పుట్టినరోజు సందర్భంగా ఆమె పాత్రను పరిచయం చేస్తూ చిత్రబృందం ఓ వీడియోను విడుదల చేశారు. ఈసినిమాలో ఆమె వింజమర వంశంలోని మహారాణి రుక్మిణిదేవిగా నటించనుంది. మహారాణి లుక్ లో ఉన్న రీతూవర్మ పోస్టర్ అయితే ఆకట్టుకుంటుంది.

కాగా ఈసినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించనున్నారు. ఈసినిమాకు సినిమాటోగ్రాఫర్ గా వేదరామన్‌ శంకరన్‌ పనిచేస్తుండగా.. సంగీతం వివేక్‌ సాగర్‌ అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 11 =