టాలీవుడ్ హీరో మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘కన్నప్ప’. ఒకప్పటి బ్లాక్ బస్టర్ ‘భక్త కన్నప్ప’ సినిమాను రీమేక్ చేయాలనే విష్ణు మంచు కోరిక మేరకు ఇది రూపొందుతోంది. ఈ చిత్రానికి ‘మహాభారతం’ సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో దేశవ్యాప్తంగా పలు సినీ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు నటిస్తుండటం విశేషం. కాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ న్యూజిలాండ్‌లో జరుగుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన మోషన్ పోస్టర్ సినీ ప్రియులను ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. మహా శివరాత్రి కానుకగా.. శుక్రవారం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ‘కన్నప్ప’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. కాగా ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచే విధంగా ఉంది.
This Mahashivaratriॐ, dive into the tale of Shiva’s greatest devotee as team unveils the first look of #𝐊𝐚𝐧𝐧𝐚𝐩𝐩𝐚🏹. Experience the journey of the bravest warrior and the biggest devotee as this epic tale comes to life ✨@themohanbabu @ivishnumanchu @Mohanlal #Prabhas… pic.twitter.com/UHXzP6UIyp
— Telugu FilmNagar (@telugufilmnagar) March 8, 2024
ఇక భక్తిరస ప్రధానంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శివుడి పాత్రలో నటించనుండగా.. నయన తార, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, శరత్ కుమార్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరించడంతో పాటుగా సినిమాలో ఒక ముఖ్య పాత్రను పోషిస్తుండటం విశేషం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: