రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మొదటి భాగం సీజ్ ఫైర్ గత ఏడాది చివర్లో విడుదలై బ్లాక్ బాస్టర్ అయిన సంగతి తెలిసిందే.ఈసినిమా 600కోట్ల వరకు రాబట్టింది.దీనికి సీక్వెల్ కూడా రానున్నడడంతో సలార్ 2 పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.శౌర్యంగపర్వం పేరుతో తెరకెక్కనుంది.ఇక ఈసినిమా షూటింగ్ ఏప్రిల్ లో స్టార్ట్ కానుందని ఫస్ట్ పార్ట్ లో నటించిన బాబీ సింహ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు. తాజాగా మరోసారి షూటింగ్ గురించి అప్డేట్ వచ్చింది.ఫస్ట్ పార్ట్ లో కీలక పాత్రలో కనిపించిన మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ అతి త్వరలో సలార్ 2 షూటింగ్ స్టార్ట్ కానుందని ఓ సినిమా ప్రమోషన్ లో తెలిపాడు.దాంతో ఏప్రిల్ లో షూటింగ్ స్టార్ట్ కావడం దాదాపు ఖాయమైనట్లే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మొదటి భాగంలో ప్రభాస్,పృథ్వీరాజ్ సుకుమారన్ గొప్ప స్నేహితుల కనిపించారు కానీ సెకండ్ పార్ట్ లో ఇద్దరు బద్ద శత్రువులు గా మారనున్నారు.ప్రశాంత్ నీల్ ఈసినిమాను డైరెక్ట్ చేయనుండగా రవి బస్రుర్ సంగీతం అందించనున్నాడు.విజయ్ కిరగందుర్ నిర్మించనున్నాడు.వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇక ప్రస్తుతం ప్రభాస్,కల్కి 2898 ఏడి తో బిజీ గా వున్నాడు.మే 9న ఈసినిమా రిలీజ్ కానుంది.ఈసినిమా తో పాటు రాజా సాబ్ లో కూడా నటిస్తున్నాడు.మారుతి ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.అన్నికుదిరితే ఈసినిమాను సంక్రాంతి బరిలో నిలుపాలని చూస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: