ఆ ఒక్కటీ అడక్కు.. టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Allari Naresh Aa Okkati Adakku Teaser Release Date Fixed

టాలీవుడ్ కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫుల్ కామెడీ డ్రామాగా రూపొందుతోంది. ఇక ఈ సినిమాలో ‘జాతిరత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తుండగా.. భరత్ లక్ష్మీపతి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా మార్చి 22న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ మూవీ ప్రమోషన్స్‌ని ప్రారంభించారు. ఈ క్రమంలో ఇటీవలే ఫస్ట్ సింగిల్ ‘ఓ మేడమ్‌’ను మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ థమన్ లాంచ్ చేయగా మంచి అటెన్షన్ రాబట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక కీలక అప్‌డేట్ వచ్చింది. ‘ఆ ఒక్కటీ అడక్కు’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. మంగళవారం (మార్చి 12, 2024) రోజున టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

కాగా ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, జామీ లీవర్, వైవా హర్ష, కల్పలత, హరి తేజ, అరియానా గ్లోరీ తదితరులు కీలక పాత్రలు పోషిన్నారు. మెలోడీ నంబర్స్ చేయడంలో స్పెషలిస్ట్ అయిన గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అబ్బూరి రవి రైటర్‌గా, సూర్య డీవోపీగా పని చేస్తున్నారు. అలాగే చోటా కె ప్రసాద్ ఎడిటర్ కాగా, జె కె మూర్తి ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − fourteen =