చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ‘సత్యం’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సూర్యకిరణ్ కన్ను మూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన ఇటీవల అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి సూర్యకిరణ్ ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సూర్యకిరణ్ అంత్యక్రియలు చెన్నైలో జరగనున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా సూర్యకిరణ్ తొలుత చైల్డ్ ఆరిస్టుగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలో ఆయన మాస్టర్ సురేష్ పేరుతో బాలనటుడిగా, సహాయ నటుడిగా వివిధ పాత్రలలో 200లకు పైగా చిత్రాల్లో నటించారు. ఇక తొలిసారిగా సుమంత్ హీరోగా వచ్చిన ‘సత్యం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘ధన 51, ‘బ్రహ్మాస్త్రం’, ‘రాజుభాయ్’, ‘చాప్టర్ 6’ వంటి పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. అలాగే తమిళంలో వరలక్ష్మి శరత్‌కుమార్ నటించిన ‘అరసి’ చిత్రాన్ని తెరకెక్కించారు.
బాలనటుడిగా కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు అవార్డులను అందుకోవడం విశేషం. అలాగే దర్శకుడిగా కూడా ఆయన రెండు నంది పురస్కారాలను అందుకున్నారు. తెలుగు బిగ్ బాస్’ సీజన్ 6లో కంటెస్టెంట్ హౌస్ లో కూడా అడుగుపెట్టారు. ప్రముఖ నటి సుజిత సూర్య కిరణ్ కు సోదరి కాగా.. హీరోయిన్ కల్యాణిని ఆయన ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాలతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. సూర్యకిరణ్ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘రాక్షసుడు’, ‘దొంగమొగుడు’, ‘స్వయం కృషి’, ఖైదీ నం.786′, ‘కొండవీటి దొంగ’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: