గామి మూవీ రివ్యూ-సరికొత్త అనుభూతిని ఇచ్చే విజువల్ వండర్

vishwak sen gaami movie telugu review

యంగ్ హీరో విశ్వక్ సేన్ నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా గామి. విధ్యాధర కాగిట దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా వస్తుండటంతో సినిమాపై మొదటినుండీ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ అన్నీ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకొని సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది.. ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది అన్న విషయం తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. విశ్వక్ సేన్, చాందిని చౌదరి, హారిక,మహమ్మద్ తదితరులు
దర్శకత్వం. విద్యాధర్ కాగిట
బ్యానర్స్.. వి సెల్యూలాయిడ్
నిర్మాతలు..కార్తీక్ శబరీష్
సంగీతం..స్వీకర్ అగస్తి, నరేష్ కుమారన్
సినిమాటోగ్రఫి..విశ్వనాథ్‌ రెడ్డి చెలుమళ్ల

కథ

శంకర్ (విశ్వక్ సేన్) అఘోరాల ఆశ్రమంలో ఉంటాడు. తనకి ఒక విచిత్రమైన సమస్య ఉంటుంది. మనిషి స్పర్శ తగిలితే తన శరీరం వింత మార్పులకు లోనవుతుంది. తన సమస్య తీరాలంటే 36 సంవత్సరాలకి ఒకసారి హిమాలయాల్లోని ద్రోణగిరి పూసే మాలిపత్రాలు అనే ప్రత్యేకం అయిన పువ్వులు సేవించాలి. అది తెలుసుకొని వాటికోసం ప్రయాణం సాగిస్తుంటాడు. ఈ ప్రయాణంలో చాందిని చౌదరి అతనికి తోడుగా ఉంటుంది. మరో వైపు భారత్, చైనా బోర్డర్ లో మనుషులపై ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. అందులో సీటీ 333 (మహ్మద్ సమద్) తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంకోవైపు దుర్గ (అభినయ) అనే దేవదాసి, ఆమె కూతురు ఉమ (హారిక)లది మరో కథ. ఈ మూడు కథలూ చివరికి ఏం అయ్యాయి? శంకర్ తన సమస్యని అధిగమించాడా? సీటీ 333 అక్కడ్నుంచి తప్పించుకున్నాడా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

మొదటినుండీ విశ్వక్ సేన్ కాస్త డిఫరెంట్ సినిమాలను చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుండేవాడు. అందుకు తాను చేసిన సినిమాలే ఉదాహరణగా చెప్పొచ్చు. ఇక ఇప్పుడు గామి తో వచ్చేశాడు. గామి కథ ఒక్క కథలా చెప్పడానికి కష్టం. ఎందుకంటే మూడు కథలు పార్లల్ గా నడుస్తుంటాయి. డైరెక్టర్ విద్యాధర్ మాత్రం మంచి కథతో వచ్చాడని చెప్పొచ్చు. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకూ ఎంగేజింగ్ గా నడిపించడంలో సక్సెస్ అయ్యాడు.

ఫస్ట్ హాఫ్ అంతా ఎంతో ఎంగేజింగ్‌గా అనిపిస్తుంది. మూడు కథలను పార్లల్ గా చూపిస్తూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు దర్శకుడు. సెకండ్ హాఫ్ అక్కడక్కడ కాస్త స్లో అనిపించినా చివరి 30 నిమిషాలు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయి. హిమాలయాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మనుషులపై ప్రయోగాలు, సీటీ 333పై జరిగే ప్రయోగాలు, అతను అక్కడి నుంచి పారిపోవడానికి చేసే ప్రయత్నాలు ఆసక్తికరంగా ఉంటాయి. అభినయ, తన కూతురు ఉమ కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

పెర్ఫామెన్స్
ఇక ఈసినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది విశ్వక్ సేన్ నటన గురించి. తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పొచ్చు. తన యాక్టింగ్, స్క్రీన్ ప్రజెన్స్ తో మెప్పించాడు. ఇక హీరోయిన్ గా నటించిన చాందిని చౌదరి కూడా తన పాత్ర మేరకు బాగానే నటించింది. దేవదాసి దుర్గగా అభినయ నటన బాగుంది. హారిక, మహహ్మద్, దయానంద్, మయాంక్ ఇలా అందరూ తమ తమ పాత్రల్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటారు

టెక్నికల్ వాల్యూస్

ఈసినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది టెక్నికల్ వాల్యూస్ గురించి. సినిమా కథ ఒక ఎత్తైతే టెక్నికల్ గా ఈసినిమాను చూపించిన విధానం మరో ఎత్తు. టెక్నికల్‌ టీం పనితనానికి ఫిదా అవ్వాల్సిందే. విజువల్స్ ఎంతో సహజంగా అనిపిస్తాయి. ముఖ్యంగా హిమాలయాలు అక్కడి సీన్స్ లో వచ్చే లొకేషన్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఇక నేపథ్య సంగీతం కూడా ఈసినిమాకు మరో ప్లస్ పాయింట్. ఇంకా చెప్పుకోవాల్సింది నిర్మాణ విలువలు. ఇంత తక్కువ బడ్జెట్ లో అంత మంచి అవుట్ పుట్ ఇచ్చారంటే మెచ్చుకోకుండా ఉండలేము.

ఓవరాల్ గా చెప్పాలంటే గామి సినిమా చూసిన ప్రేక్షకుడికి ఓ కొత్త అనుభూతిని ఇస్తుందన్న సందేహం లేదు. ప్రతి ఒక్కరూ ఈసినిమాను చూసి ఎంజాయ్ చేసే సినిమా అని చెప్పొచ్చు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − seven =