టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన మాతృమూర్తి శ్రీమతి సూర్యదేవర నాగేంద్రమ్మ గురువారం కన్నుమూశారు. 90 సంవత్సరాల నాగేంద్రమ్మ హృదయ సంబంధిత వ్యాధితో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు ప్రకటించారు. రేపు ఉదయం 10 గంటలకు ఫిల్మ్ నగర్ లోని విద్యుత్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూర్యదేవర నాగేంద్రమ్మకు ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు సంతానం కాగా వారిలో నిర్మాత రాధాకృష్ణ రెండో కుమారుడు. ఇక యువ నిర్మాత, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీకి నాగేంద్రమ్మ నానమ్మ అవుతారు. నాగవంశీ, రాధాకృష్ణ సోదరుడి తనయుడే అన్న విషయం తెలిసిందే. కాగా నాగవంశీ నిర్మాతగా విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రం శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నాగేంద్రమ్మ మృతి చెందడంతో వారి ఇంట విషాదం నెలకొంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: