హరి హర వీరమల్లు రిలీజ్ పై మరో ట్విస్ట్

Hari Hara Veera Mallu Movie Release Date

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రస్తుతం ఆసక్తిగా ఎదురుచూస్తుంది హరి హర వీరమల్లు సినిమా కోసం. రీఎంట్రీ తరువాత పవన్ కళ్యాణ్ నుండి వచ్చిన వకీల్ సాబ్ అలానే భీమ్లా నాయక్ సినిమాలు రెండూ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నాయి. దీంతో ఈసినిమాతో పవన్ ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని కోరుకుంటున్నారు. అందుకే రిలీజ్ కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. పవన్‌ బర్త్‌డే సందర్భంగా రిలీజైన టీజర్‌ ఒక్కసారిగా సినిమా అంచనాలను పెంచింది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇక ఇప్పటివరకూ ఈసినిమాకు క్రిష్ దర్శకత్వం వహించగా.. మిగిలిన భాగాన్ని ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించనున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ఈసినిమా గురించి, ఈసినిమా రిలీజ్, షూటింగ్ అప్ డేట్ల గురించి నిర్మాత ఏఎం రత్నం ఎప్పటికప్పుడు తెలియచేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా మరోసారి ఈసినిమా అప్ డేట్ ఇచ్చారు ఏఎం రత్నం. తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన ఆయన పలు విషయాలు తెలియచేశారు. ఈసినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది.. ఇంకా 25శాతం షూటింగ్ మాత్రమే మిగిలిఉంది.. ప్రస్తుతం పవన్ రాజకీయాలతో బిజీగా ఉన్నాడు.. వచ్చే నెల 4వ తేదీన రిజల్ట్ రానుంది.. ఆ తరువాత పవన్ ఎప్పుడంటే అప్పుడు మిగిలిన షూటింగ్ పూర్తి చేస్తాం.. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం అంటూ చెప్పారు. మరి ఇప్పటికే సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.. మరి ఇప్పుడు సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో అంటున్నారు.. చూద్దాం రిలీజ్ డేట్ ఏమైనా మారే అవకాశం ఉందేమో..

కాగా ఈసినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్ నటిస్తుండగా.. బాలీవుడ్ నుండి అర్జున్‌ రాంపాల్‌ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమాను తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.ప్రముఖ సంగీత ద‌ర్శకుడు యం.యం.కీర‌వాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫ‌ర్ జ్ఞాన ‌శేఖ‌ర్ వి.ఎస్‌. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.