పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘కల్కి 2898 AD’. ఎపిక్ సైన్స్ ఫిక్షన్ గా రూపొందిన ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే కథానాయికగా.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అశ్వనీదత్ నిర్మించారు. సుమారు రూ.600 కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ మూవీని భారతదేశంలోనే ఇప్పటివరకూ వచ్చిన అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా పేర్కొంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ‘కల్కి 2898 AD’ జూన 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ సహా మరికొన్ని విదేశీ భాషల్లోనూ ఈ చిత్రం రిలీజ్ కానుందని సమాచారం. ‘సలార్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న మూవీ కావడం, అందునా భారతీయ తెరపై ఇప్పటివరకూ రానటువంటి కథతో రూపొందుతుండటంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో హీరో ప్రభాస్ కల్కి గురించి అనేక ఆసక్తికర విశేషాలు వెల్లడించారు.
‘Kalki 2898 AD’: Inside The Prabhas-Starring Sci-Fi Epic That Is One Of India’s Most Expensive Movies Of All Time https://t.co/PWSEARDVcY
— Deadline Hollywood (@DEADLINE) May 29, 2024
తాజాగా ఆయన ప్రముఖ హాలీవుడ్ మీడియా ‘డెడ్‍లైన్’ నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ ఏమన్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.. “కల్కి 2898 ఏడీ ఇంటర్నేషన్ ఆడియన్స్‌కు సైతం నచ్చేలా రూపొందించాం. గ్లోబల్ రేంజ్‍లో ఉండాలన్న ఉద్దేశంతోనే అంత హైయ్యెస్ట్ బడ్జెట్‍ను పెట్టాల్సి వచ్చింది. అలాగే ఈ ప్రాజెక్టులోకి దేశంలోని అత్యుత్తమమైన నటీనటులను తీసుకున్నాం. తొలి పాన్ ఇండియా స్టార్‌గా పేరు గడించడం నాపై పెద్దగా ప్రభావం చూపదు. అయితే దేశవ్యాప్తంగా ప్రేక్షకులు నా పట్ల ఇంతటి అభిమానం చూపించడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది” అని ప్రభాస్ తెలిపారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























