టాలీవుడ్ టాలెంటెడ్ నటుల్లో సత్యదేవ్ పేరు కూడా ముందుంటుంది. ఏ పాత్ర అయినా సరే తనదైన శైలిలో నటించగలితే సత్తా ఉన్న నటుడు. సత్యదేవ్ కు కూడా మంచి హిట్ దక్కి చాలా కాలమై పోయింది. అయినా కూడా సినిమా జయాపయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా తన నుండి వచ్చిన సినిమా కృష్ణమ్మ. వీవీ గోపాల కృష్ణ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా మే 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే ఈసినిమా కూడా సరైన విజయాన్ని అందించలేకపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా ఓటీటీలోకి కూడా వచ్చిన సంగతి విదితమే. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ లో ఈసినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఇప్పుడు ఈసినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో ఈసినిమా 240కు పైగా దేశాలలో స్ట్రీమింగ్ అవుతుంది.
కాగా ఇంకా ఈసినిమాలో లక్ష్మణ్, కృష్ణ, అథిరా రాజ్, అర్చన, నంద గోపాల్, రఘు కుంచె, తారక్, సత్యం కీలక పాత్రల్లో నటించారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కింది. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి ఈ సినిమాను నిర్మించారు. కాలబైరవ సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























