టాలీవుడ్ హీరో సుధీర్ బాబు కు కూడా మంచి హిట్ దక్కి చాలా రోజులైంది. ఈమధ్య పలు సినిమాలతో వచ్చినా కూడా ఏది సాలిడ్ హిట్ ను అందించలేకపోయింది. ఇక ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో వస్తున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా హరోం హర. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా చిత్తూరు నేపథ్యంలో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. జూన్ 14వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ అయితే మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది. యాక్షన్ ఎలిమెంట్స్, సుధీర్ బాబు నటన, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ హైలెట్ గా నిలుస్తున్నాయి.
Looking forward to see what #HaromHara brings to the screen! The trailer looks interesting! My best wishes to @isudheerbabu and team!! 👍👍https://t.co/EUEgm04BIU@ImMalvikaSharma @gnanasagardwara #SumanthNaiduG @chaitanmusic @JungleeMusicSTH @SSCoffl
— Mahesh Babu (@urstrulyMahesh) May 30, 2024
కాగా ఈసినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. సునీల్, జయప్రకాష్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ జీ నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అరవింద్ విశ్వనాథన్ సినిమా సినిమాటోగ్రఫీ.. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా విడుదల కానుంది..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























