పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఓజీ’ సెప్టెంబర్ 27న విడుదలకానుందని తెలిసిందే. పవన్ అందుబాటలో లేకపోవడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది లేకపోతే ఈపాటికి షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యేది. అయితే రిలీజ్ డేట్ విషయంలో పవన్ ఫ్యాన్స్ కు ఇప్పుడు కొత్త టెంక్షన్ మొదలయ్యింది. ఓజీ వచ్చే డేట్ కు లక్కీ భాస్కర్ వస్తుందని మేకర్స్ నిన్న ప్రకటించారు. వెంకీ అట్లూరి ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆల్రెడీ ఓజీ డేట్ అనౌన్స్ చేసినా కూడా అదే రోజు లక్కీ భాస్కర్ ను ఎలా దింపుతున్నారన్న సందేహాలు మొదలయ్యాయి. ఇక ఇదే ప్రశ్నను లక్కీ భాస్కర్ నిర్మాత నాగవంశీని అడుగగా పవన్ కళ్యాణ్ సినిమా వస్తే మేము ఎందుకు వస్తాం అండి అని సమాధానం ఇచ్చాడు. దాంతో పవన్ ఫ్యాన్స్ కు కొత్త డౌట్ క్రియేట్ అయ్యింది.
అంటే ఓజీ రాదని తెలిసే లక్కీ భాస్కర్ ను దించుతున్నారా అన్న చర్చ జరుగుతుంది. మరోవైపు ఓజీ వస్తే మాత్రం తప్పుకుంటాం అని నాగవంశీ అంటున్నాడు. అయితే ఓజీ రిలీజ్ పవన్ చేతుల్లోనే వుంది. పవన్ జూన్ నుండి అయినా షూటింగ్ కు అందుబాటులో ఉంటే అనుకున్న టైం కు రిలీజ్ సాధ్యపడుతుంది లేకపోతే వెనక్కి వెళ్లకతప్పదు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























