మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. సీతారామం సినిమాతో ఆ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇక ఇప్పుడు మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరీ దర్శకత్వంలో లక్కీ భాస్కర్ అనే సినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. టీజర్ మంచి రెస్పాన్సే తెచ్చుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక చాలా రోజుల తరువాత ఈసినిమా నుండి క్రేజీ అప్ డేట్ తో వచ్చారు మేకర్స్. ఈసినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్ డేట్ తో వచ్చారు. సెప్టెంబర్ 27వ తేదీన ఈసినిమా రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు చిత్రబృందం. మరి సెప్టెంబర్ 27వ తేదీన ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా రిలీజ్ ఉంది. ఇదే రోజు రిలీజ్ అయితే కనుక లక్కీ భాస్కర్ కు మంచి పోటీ ఉన్నట్టే అవుతుంది. చూద్దాం మరి అప్పటికి ఇదే డేట్ ఉంటుందా? లేక ఏదైనా మారే అవకాశం ఉంటుందా?
Gear up to witness an extra-ordinary tale of our endearing and passionate #LuckyBaskhar in theatres from SEPTEMBER 27th! 🏦#LuckyBaskharOnSept27th 📈💵@dulQuer #VenkyAtluri @gvprakash @Meenakshiioffl @vamsi84 @NimishRavi @NavinNooli @Banglan16034849 #SaiSoujanya @SitharaEnts… pic.twitter.com/K10dLWyGSU
— Sithara Entertainments (@SitharaEnts) May 29, 2024
కాగా ఈసినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను సితారా ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ 4 సినిమాస్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈసినిమాను తెలుగు తో పాటు మలయాళంలో కూడా రిలీజ్ చేయనున్నారు. జీవీ ప్రకాష్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























