కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Tollywood Movie Updates

ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 160

Meera Jasmine First Look Poster Gone Viral From Sree Vishnu's Swag Movie
ఫస్ట్ లుక్

స్వాగ్.. మీరా జాస్మిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'స్వాగ్ '. ఇప్పటికే ఆయన 'సామజవరగమనా', 'ఓం భీమ్ బుష్' సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న విష‌యం తెలిసిందే. ప్రయోగాత్మక సినిమాలలో నటించేందుకు ఆసక్తి కనబరిచే శ్రీ విష్ణు మరోసారి దీనిని కొనసాగిస్తూ సరికొత్త పంథాలో ఈ స్వాగ్ మూవీలో నటిస్తున్నారు. ఈ క్రమంలో అచ్చ తెలుగు సినిమా #SWAG అంటూ ఇప్ప‌టికే విడుద‌ల చేసిన గ్లింప్స్‌కి మంచి స్పందన వచ్చింది.

Srikanth Mవాట్సాప్
rajinikanth interesting update on vettaiyan movie release date
రిలీజ్ అప్‌డేట్

దేవరకు పోటీగా రజనీ వెట్టైయాన్

పెద్ద పెద్ద పండుగల వస్తున్నాయంటే బాక్సాఫీస్ వద్ద పోటీ ఎలా ఉంటుందో పెద్దగా చెప్పనక్కర్లేదు. పెద్ద పండుగలు కాబట్టి పెద్ద సినిమాలే ముందుగా డేట్లను రిజర్వ్ చేసుకుంటాయి. ఇప్పటికే సంక్రాంతి అయిపోయింది కాబట్టి వచ్చేది దసరా పండుగ. ఈ దసరాకు ఇప్పటికే ఎన్టీఆర్ దేవర సినిమా డేట్ ను ఫిక్స్ చేసుకుంది. అయితే ఇప్పుడు మరో సినిమా కూడా దసరా బరిలోకి దేవరకు పోటీగా రానుంది. ఈ సినిమా మరేదో కాదు తలైవా రజనీకాంత్ వైట్టైయాన్ సినిమా.

TFN Adminవాట్సాప్
pooja hegde on board for suriya 44 movie
సినిమా వార్తలు

అఫీషియల్- సూర్య 44 లో పూజా హెగ్డే

తమిళ్ స్టార్ హీరో సూర్య మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే సూర్య శివ దర్శకత్వంలో కంగువ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఈసినిమాలో సూర్య సరసన దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. బాబి డియోల్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాని స్టూడియో గ్రీన్ తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యు.వీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం…

TFN Adminవాట్సాప్
oc telugu movie trailer out now
ట్రైలర్ & టీజర్

OC మూవీ ట్రైలర్ రిలీజ్

ఇప్పుడు చిన్న సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. కథలో కంటెంట్ ఉండే హీరో, హీరోయిన్ ఎవరనేది కూడా చూడట్లేదు. అలా ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విష్ణు బోంపల్లి దర్శకత్వంలో హరీష్ బోంపల్లి హీరోగా వస్తున్న సినిమా ఓసీ. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకునే పనులో ఉంది. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు మేకర్స్. దీనిలో భాగంగానే తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది. పనిపాట లేని ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు.. వారికి సినిమా అంటే పిచ్చి ఉంటుంది. ఈనేపథ్యంలోనే సినిమాల్లో…

TFN Adminవాట్సాప్
Gam Gam Ganesha first day collections
బాక్సాఫీస్

గం.గం.. గణేశా ఫస్ట్ డే కలెక్షన్స్

గత ఏడాది బేబీతో సాలిడ్ హిట్ కొట్టిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నిన్న గం. గం.. గణేశాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈసినిమా డీసెంట్ రివ్యూస్ తెచ్చుకోవడంతో మొదటి రోజు పర్వాలేదనే వసూళ్లను సొంతం చేసుకుంది.ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు 1.82 కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుందని మేకర్స్ పోస్టర్ ద్వారా తెలిపారు.మౌత్ టాక్ బాగుండడంతో మొదటి రోజు కంటే ఈరోజే ఎక్కువ వసూళ్లను రాబట్టుకునే ఛాన్స్ వుంది.ఇక ఈసినిమా 5కోట్ల షేర్ టార్గెట్ తో బరిలోకి దిగింది.ఇదే రన్ ను కొనసాగిస్తే వచ్చే వారం లో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేయొచ్చు.

TFN Adminవాట్సాప్
Manamey movie has 16 tracks
సినిమా వార్తలు

మనమే లో అన్ని పాటలా

ఒకే ఒక జీవితంతో డీసెంట్ హిట్ కొట్టి గ్యాప్ తీసుకున్న యంగ్ హీరో శర్వానంద్ మనమే అంటూ పలకరించడానికి రెడీ అవుతున్నాడు.శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేసిన ఈసినిమా మరో ఆరు రోజుల్లో థియేటర్లలోకి రానుంది.మనమే విజయంపై శర్వా చాలా కాన్ఫిడెంట్ గా వున్నాడు.ఈరోజు రిలీజైన ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా అనిపించింది దాంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

TFN Adminవాట్సాప్
Bellamkonda Srinivas tyson naidu movie shooting full swing in rajasthan
షూటింగ్ అప్‌డేట్

రాజస్థాన్ లో టైసన్ నాయుడు సందడి

అల్లుడు శ్రీను సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్‌. ఇప్పటివరకూ పలు సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. సూపర్ హిట్ భీమ్లా నాయక్ మూవీ ఫేమ్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో బెల్లంకొండ హీరోగా వస్తున్న సినిమా టైసన్ నాయుడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా అవి బాగానే ఆకట్టుకున్నాయి.

TFN Adminవాట్సాప్
check out the top ten tollywood lyrical video songs
సాంగ్

టాలీవుడ్ టాప్ లిరికల్ వీడియో సాంగ్స్ ఇవే

యూ ట్యూబ్ లో విడుదలైన 24గంటల్లో ఓ లిరికల్ వీడియో సాంగ్ ఎంత ఎక్కువ వ్యూస్ రాబట్టుకుంటే సాంగ్ అంతపెద్ద హిట్టు ఇప్పుడు అదే ట్రెండ్.టాలీవుడ్ లో 24గంటల్లో వ్యూస్ పరంగా టాప్ లో వున్న సాంగ్స్ ఓసారి చూస్తే అందులో సూపర్ స్టార్ మహేష్ బాబువే వరసగా 4పాటలు వున్నాయి.ఈ జాబితాలో గుంటూరు కారం నుండి వచ్చిన ధమ్ మసాలా 17.42మిలియన్ల వ్యూస్ తో మొదటి స్థానంలో ఉండగా కళావతి 14.78 మిలియన్ల వ్యూస్ తో రెండో స్థానంలో వుంది దీని తరువాత పెన్నీ సాంగ్ 16.38 మిలియన్ల వ్యూస్ తో అలాగే మ మ మహేశా 13.56మిలియన్ల వ్యూస్ తో 3, 4 స్థానాల్లో కొనసాగుతున్నాయి.ఈమూడు పాటలు సర్కారు వారి పాట లోనివే.

TFN Adminవాట్సాప్
cinematographer senthil kumar joined for nikhils swayambhu movie
సినిమా వార్తలు

నిఖిల్ స్వయంభూ కోసం ప్రముఖ సినిమాటోగ్రాఫర్

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ కార్తికేయ 2 సినిమాతో ఇక్కడ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈక్రేజ్ తో ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాతో అలరించడానికి వస్తున్నాడు. భరత్‌ కృష్ణమాచారి ద‌ర్శ‌క‌త్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న సినిమా స్వయంభూ. పీరియాడిక‌ల్ యాక్షన్‌ డ్రామాగా ఈసినిమా వస్తుండగా.. ఈసినిమాలో నిఖిల్ వారియర్ గా కనిపించనున్నాడు. దీనికోసం నిఖిల్ ఇప్పటికే మేకోవర్ పూర్తిగా మార్చేశాడు. యుద్ద విద్యల్లో శిక్షణ కోసం తీసుకున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
nikhil birthday poster out from swayambhu movie
ఫస్ట్ లుక్

స్వయంభూ నుండి నిఖిల్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న సినిమా స్వయంభూ. సోసియో ఫాంటసీ చిత్రంగా నిఖిల్ కెరీర్ లోనే భారీ స్థాయిలో ఈసినిమా వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, మేకింగ్ వీడియోస్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ గురించి ఒక క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో భారీ ఎపిక్ వార్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నట్టు.. ఈ ఒక్క ఎపిసోడ్ కే 8కోట్ల బడ్జెట్ ను పెట్టినట్టు తెలిపారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.

TFN Adminవాట్సాప్
Krithi Shetty About Her Dream Role
సినిమా వార్తలు

నా డ్రీమ్ రోల్ అదే

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్, కృతిశెట్టి ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా మనమే. లవ్ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా రానున్న ఈసినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇప్పటికే వచ్చిన టీజర్, పాటలు అన్నీ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. ఇక తాజాగా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయగా.. ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో పాటు శర్వాకు మంచి హిట్ పడే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వస్తున్నాయి.

TFN Adminవాట్సాప్
Hari Hara Veera Mallu Aiming For Dec 2024 Release
సినిమా వార్తలు

హరి హర వీరమల్లు రిలీజ్ అప్పుడే

పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు.ఇది రెండు భాగాలుగా రానుందని తెలిసిందే.ఇక ఈసినిమా స్టార్ట్ అయ్యి మూడు ఏళ్లు అవుతున్నా ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు.పవన్ డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.ఇక ఇప్పుడు ఈసినిమాను తొందరగా పూర్తి చేయడానికి టీం రెడీ అవుతుంది.పవన్ కూడా ఎలక్షన్స్ రిజల్ట్ తరువాత ఈసినిమాకు డేట్స్ ఇవ్వనున్నాడని సమాచారం దాంతో ఈసినిమాను ఆగస్టు లోగా పూర్తి చేసి డిసెంబర్ లో తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.మరోవైపు ఓజీ సెప్టెంబర్ 27న వస్తుందని ముందు ప్రకటించినా వెనక్కి వెళ్లడం తప్పేలా లేదు.

TFN Adminవాట్సాప్
Gangs Of Godavari first day collections
బాక్సాఫీస్

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫస్ట్ డే కలెక్షన్స్

విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది.రివ్యూస్ తో సంబంధంలేకుండా అంచనాలకు మించి ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు ఈసినిమా 8.2కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుందని మేకర్స్ పోస్టర్ ద్వారా ప్రకటించారు.ఇందులో షేర్ 4కోట్ల పైనే.మొత్తం 12కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా ఈ రెండు రోజులు ఇదే జోరు కొనసాగిస్తే బ్రేక్ ఈవెన్ ను చేరుకోనుంది. విశ్వక్ కెరీర్ లో ఇవే బెస్ట్ ఓపెనింగ్స్.

TFN Adminవాట్సాప్
sharwanand manamey movie trailer out now
ట్రైలర్ & టీజర్

శర్వానంద్ మనమే ట్రైలర్ రిలీజ్-ఫన్ ప్లస్ కలర్ ఫుల్

టాలీవుడ్ ప్రామిసింగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అందులో ముందుగా రిలీజ్ కు సిద్దంగా ఉన్న సినిమా మనమే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, పలు పాటలను రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

TFN Adminవాట్సాప్
krithi shetty sharing interesting facts about manamey movie
సినిమా వార్తలు

మనమే స్ట్రాంగ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్

డైనమిక్ హీరో శర్వానంద్ తన ల్యాండ్‌మార్క్ 35వ మూవీ 'మనమే' తో హోల్సమ్ ఎంటర్ టైన్మెంట్ ని అందించడానికి రెడీగా వున్నారు. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రామ్‌సే స్టూడియోస్‌ ప్రొడక్షన్ లో నిర్మాత టిజి విశ్వప్రసాద్‌ అత్యంత గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. 'మనమే' జూన్ 7న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ కృతి శెట్టి మూవీ విశేషాలని విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.

TFN Adminవాట్సాప్
pawan kalyan hari hara veera mallu movie shooting update
షూటింగ్ అప్‌డేట్

హరి హర వీరమల్లు- పవన్ జాయిన్ అయ్యేది అప్పుడే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. మొదటిసారి పీరియాడిక్ యాక్షన్ ఎంటర్ లో పవన్ నటిస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను మొదలుపెట్టారు ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ కూడా పూర్తిచేసుకుంది.

TFN Adminవాట్సాప్
Gam Gam Ganesha telugu review
రివ్యూ

గం.గం.. గణేశా రివ్యూ

ఓవరాల్ గా గం గం గణేశా లో ఆనంద్ దేవరకొండ నటన ,కామెడీ సన్నివేశాలు ,క్లైమాక్స్ హైలైట్ అయ్యాయి.ఓ మంచి టైం పాస్ ఎంటర్టైనర్ చూడాలనుకుంటే ఈసినిమాను చూడొచ్చు.

Srikanth Mవాట్సాప్
noted distribution house acquired andhra pradesh and ceded release rights
సినిమా వార్తలు

ప్రముఖ సంస్థకు సత్యభామ ఆంధ్ర, సీడెడ్ హక్కులు

డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని తన ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ పలు సినిమాలను రిలీజ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ ఏడాది ఇప్పటికే 'బేబి', 'గుంటూరు కారం', 'హనుమాన్', 'గామి', 'ఓం భీమ్ బుష్', 'టిల్లు స్క్వేర్' వంటి సూపర్ హిట్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి డిస్ట్రిబ్యూటర్ గా సక్సెస్ ఫుల్ జర్నీ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ భజే వాయు వేగం సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను కూడా సొంతం చేసుకుంది. ఈసినిమా ఈరోజు రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
devaki nandana vasudeva movie jai bolo krishna full song out now
సాంగ్

దేవకీ నందన వాసుదేవ జై భోలో కృష్ణ ఫుల్ సాంగ్ రిలీజ్

సూపర్ స్టార్ కృష్ణ మనవడిగా, మహేష్ బాబు మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అశోక్ గల్లా. హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అశోక్ మొదటిసినిమాతోనే తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దాదాపు రెండేళ్ల తరువాత ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. అర్జున్ జంధ్యాల దర్శకత్వం అశోక్ హీరోగా వస్తున్న సినిమా దేవకీ నందన వాసుదేవ. ఈసినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుందని ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ ను బట్టి అర్థమవుతుంది. మేకర్స్‌ రిలీజ్ చేసిన గ్లింప్స్ లో బురదలో జరిగే ఫైట్‌ సన్నివేశంతో కట్‌ చేసిన ఫస్ట్ యాక్షన్‌ సీక్వెన్స్‌ ఇప్పటికే సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తూ.. సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది.

TFN Adminవాట్సాప్
Gangs of Godavari telugu review
రివ్యూ

రివ్యూ : గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి

ఓవరాల్ గా రూరల్ గ్యాంగ్ స్టర్ డ్రామా గా వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లో విశ్వక్ నటన, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫస్ట్ హాఫ్ హైలైట్ అయ్యాయి. మాస్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నచ్చుతుంది. మిగితా వారు కూడా ఓ సారి చూసేయొచ్చు.

Srikanth Mవాట్సాప్

షేర్