హీరో శర్వానంద్ కు సాలిడ్ హిట్ దక్కి చాలా కాలమే అయిపోయింది. ఆ మధ్య వచ్చిన ఒకే ఒక జీవితం ఒక మోస్తరు విజయాన్ని అందించినా మంచి కమ్ బ్యాక్ ను అయితే ఇవ్వలేకపోయింది. కమర్షియల్ గా ఈసినిమా బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. ఇక ఆ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వస్తున్న సినిమా మనమే. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా టీజర్, పాటలు రిలీజ్ చేయగా అవి సినిమాపై మంచి అంచనాలనే పెంచేశాయి. ముఖ్యంగా చాలా రోజుల తరువాత ఈసారి శర్వానంద్ ఫుల్ ఎనర్జిటిక్ రోల్ తో వస్తున్నట్టు అర్థమవుతుంది. దీంతో సినిమాతో క్యూరియాసిటీ ఇంకా పెరిగింది. ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ట్రైలర్ రిలీజ్ కు సిద్దమయ్యారు మేకర్స్. దీనిలో భాగంగానే తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. జూన్ 1వ తేదీన ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.
#Manamey is all set to fly high to spread love and laughter ❤🔥
Bringing you all the 𝑻𝑹𝑨𝑰𝑳𝑬𝑹 of 𝑩𝑰𝑮𝑮𝑬𝑺𝑻 𝑬𝑵𝑻𝑬𝑹𝑻𝑨𝑰𝑵𝑬𝑹 on JUNE 1st! 🥳 #ManameyTrailer 🤩@ImSharwanand @IamKrithiShetty @SriramAdittya @vishwaprasadtg @HeshamAWMusic @IamSeeratKapoor… pic.twitter.com/wHtK6RlS7K
— People Media Factory (@peoplemediafcy) May 30, 2024
కాగా ఈసినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. విక్రమ్ ఆదిత్య కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నాడు. విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రాఫి అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























