
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 158


ఏపీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఎన్టీఆర్

విజనరీ చంద్రబాబుకి శుభాకాంక్షలు - రామ్ చరణ్

పవన్, చంద్రబాబు కు ఎన్టీఆర్ అభినందనలు

సరిపోదా శనివారం భారీ యాక్షన్ సీక్వెన్స్ తో నాని

పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షల వెల్లువ

సెకండ్ గ్లింప్స్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్

కల్కి 2898AD ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మనమే వంటి డిఫరెంట్ ఫిల్మ్‌ని చేయడం ఇదే మొదటిసారి

బ్రేక్ ఈవెన్ దిశగా భజే వాయువేగం

రజినీకాంత్ కూలీ షూటింగ్ అప్డేట్

జనసేనానికి శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్

అత్యధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్ ఘనవిజయం

పవన్ విజయంపై నితిన్ ఎమోషనల్ పోస్ట్

రిలీజ్‌కి సిద్ధమైన మనమే.. సెన్సార్ పూర్తి

మనమే రన్ టైమ్ లాక్
శర్వానంద్ హీరోగా దాదాపు రెండేళ్ల తరువాత వస్తున్న సినిమా మనమే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రొమాంటిక్ ప్లస్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఈసినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుక రానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బీజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ సినిమాపై అంచనాలను పెంచేసింది.

ఏపీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఎన్టీఆర్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే (టీడీపీ+జనసేన+బీజేపీ) కూటమి ఘనవిజయం సాధించింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఈ ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ ఒకే కూటమిగా పోటిచేయగా.. అధికార వైఎస్సార్సీపీ ఒంటరిగా బరిలోకి దిగింది. ఈ క్రమంలో ఎన్డీయే కూటమి దాదాపు 93శాతం ఓటుతో ఏకంగా 164 సీట్లు గెలిచి సంచలన విజయం నమోదు చేసింది. ఇది దేశంలోనే ఒక రికార్డుగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

ఓటిటిలోకి మైదాన్
బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ ఫుట్ బాల్ కోచ్ పాత్రలో నటించిన చిత్రం మైదాన్.ప్రముఖ ఇండియన్ ఫుట్ బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది.ఈసినిమా ఏప్రిల్ లో విడుదలై పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకున్నా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టుకోలేకపోయింది.ఫుల్ రన్ లో ప్రపంచ వ్యాప్తంగా 72కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే సొంతం చేసుకుంది.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి యూఎస్ఏ కలెక్షన్స్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి యూఎస్ఏ లో హిట్ దిశగా దూసుకుపోతుంది.నిన్నటి తో అక్కడ 250k డాలర్ల మార్క్ ను చేరుకుంది. యూఎస్ఏ లో ఈసినిమాను కాగ్నెర్ సినీ క్రియేషన్స్ రిలీజ్ చేసింది. ఈవారంలో ఈ సినిమా అక్కడ సేఫ్ జోన్ లోకి చేరుకోనుంది.ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈసినిమా బ్రేక్ ఈవెన్ కు చేరువైంది.

విజనరీ చంద్రబాబుకి శుభాకాంక్షలు - రామ్ చరణ్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే (టీడీపీ+జనసేన+బీజేపీ) కూటమి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఈ ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ ఒకే కూటమిగా పోటిచేయగా.. అధికార వైఎస్సార్సీపీ ఒంటరిగా పోటీ చేసింది. ఈ క్రమంలో ఎన్డీయే కూటమి ఏకంగా 164 సీట్లు గెలిచి సంచలన విజయం నమోదు చేసింది.

పవన్, చంద్రబాబు కు ఎన్టీఆర్ అభినందనలు
మొత్తానికి అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసిన ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఆంధ్రప్రదేశ్ లో కూటమి (తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ) ఘన విజయం సాధించింది. టీడీపీ 130 సీట్లను, జనసేన 21 సీట్లు, బీజేపీ 8 సీట్లను దక్కించుకుంది.

సరిపోదా శనివారం భారీ యాక్షన్ సీక్వెన్స్ తో నాని
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా రాబోతున్న సినిమా సరిపోదా శనివారం ఒకటి. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న రెండో సినిమా ఇది. ఈసినిమాలో నాని కంప్లీట్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో అలరించనున్నాడు. ఇప్పటికే ఈసినిమా టైటిల్ తో పాటు గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది.

పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షల వెల్లువ
తెలుగు రాష్ట్రాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కూటమి ఘనవిజయం సాధించింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గానూ అత్యధిక స్థానాలు (164) కైవసం చేసుకుని అధికారం పీఠం దక్కించుకుంది. కాగా ఈ కూటమిలో టీడీపీతో పాటుగా బీజేపీ, జనసేన పార్టీలు కూడా భాగమే అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ రికార్డు విజయం నమోదుచేసింది.

సెకండ్ గ్లింప్స్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబి దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతానికి ఎన్బీకే 109 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక బాలకృష్ణ వరుస హిట్ల తరువాత, అలానే బాబి వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లను, అలానే గ్లింప్స్ ను రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్సే సొంతం చేసుకున్నాయి.

కల్కి 2898AD ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
కల్కి మంత్ మొదలైపోయింది. అందుకే ఈసినిమా నుండి వరుస అప్ డేట్లు ఇస్తూ సినిమాపై మరింత క్రేజ్ ను క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా స్పీడు పెంచారు. మరోవైపు ఈసినిమా నుండి ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, వీడియోలు సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. రీసెంట్ గా బుజ్జి పేరుతో ఉన్న కారును కూడా రిలీజ్ చేశారు. ఈ స్పెషల్ కారు ఈ సినిమాకు మరో హైలైట్‍గా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బుజ్జిభైరవ పేరుతో యానిమేటెడ్ సిరీస్ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు వచ్చింది.

మనమే వంటి డిఫరెంట్ ఫిల్మ్‌ని చేయడం ఇదే మొదటిసారి
డైనమిక్ హీరో శర్వానంద్ తన ల్యాండ్‌మార్క్ 35వ మూవీ 'మనమే' తో హోల్సమ్ ఎంటర్ టైన్మెంట్ ని అందించడానికి రెడీగా వున్నారు. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రామ్‌సే స్టూడియోస్ ప్రొడక్షన్ లో నిర్మాత టిజి విశ్వప్రసాద్ అత్యంత గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి 4డేస్ కలెక్షన్స్
మొదటి మూడు రోజుల్లో సాలిడ్ వసూళ్లను రాబట్టుకున్న విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వర్కింగ్ డే లో కూడా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా హోల్డ్ చేసింది.సోమవారం ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 2కోట్ల గ్రాస్ ను దక్కించుకుంది దాంతో 4రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 18కోట్ల గ్రాస్ మార్క్ ను చేరుకుంది.మరో రెండు కోట్ల షేర్ ను రాబడితే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసినట్లే.ఈ వారంలో ఆ టార్గెట్ ను పూర్తి చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.అయితే ఈ శుక్రవారం మరో మూడు సినిమాలు బరిలోకి దిగుతున్నాయి.దాంతో బాక్సాఫీస్ వద్ద గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి పోటీ ఎదురుకానుంది.

బ్రేక్ ఈవెన్ దిశగా భజే వాయువేగం
యంగ్ హీరో కార్తికేయ నటించిన లేటెస్ట్ మూవీ భజే వాయు వేగం హిట్ దిశగా వెళుతుంది.పాజిటివ్ రివ్యూస్ వచ్చినా మొదటి రోజు మాత్రం తక్కువ ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది అయితే మౌత్ టాక్ కూడా బాగుండడంతో పుంజుకొని మొదటి రోజు కంటే మిగితా రెండు రోజులు ఎక్కువ వసూళ్లను సొంతం చేసుకుంది.ఇక నిన్న వర్కింగ్ డే లోకూడా బాగానే హోల్డ్ చేసి మొదటి రోజు కన్నా ఎక్కువ వసూళ్లను సొంతం చేసుకుంది.నిన్న దాదాపు కోటి రూపాయల గ్రాస్ ను దక్కించుకుంది.దాంతో నాలుగు రోజుల్లో ఈసినిమా 6 కోట్ల గ్రాస్ వసూళ్లను ఖాతాలో వేసుకుంది.ఇందులో షేర్ 3కోట్లపైనే. కేవలం 4కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగడంతో మరో కోటి రూపాయల షేర్ ను రాబట్టుకుంటే బ్రేక్ ఈవెన్ ను…

రజినీకాంత్ కూలీ షూటింగ్ అప్డేట్
గత ఏడాది జైలర్ తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు సూపర్ స్టార్ రజినీకాంత్.ఈసినిమా తరువాత రీసెంట్ గా లాల్ సలామ్ తో ప్రేక్షకులముందుకు వచ్చాడు అయితే ఇందులో హీరోగా కాదు ఓ కీలక పాత్రలో మాత్రమే కనిపించాడు.ఇక రజనీ హీరోగా రెండు రోజుల క్రితం వేట్టైయన్ అనే సినిమాను పూర్తి చేశాడు.జై భీం ఫేమ్ టిజి జ్ఞానవేల్ డైరెక్ట్ చేస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.అక్టోబర్ 10న ఈసినిమా విడుదలకానుంది.

జనసేనానికి శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్
తెలుగు రాష్ట్రాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. తెలుగుదేశం పార్టీ కూటమి అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని అధికారం చేపట్టడం ఖాయమైంది. ఈ కూటమిలో టీడీపీతో పాటుగా బీజేపీ, జనసేన పార్టీలు కూడా భాగమే అన్న విషయం తెలిసిందే. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 21 చోట్ల పోటీ చేసిన జనసేన.. ఆ పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం సహా అన్ని స్థానాల్లో గెలుపొందింది. ఈ నేపథ్యంలో ఆయనకు చిత్ర పరిశ్రమ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. తెలుగుదేశం పార్టీ కూటమి అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని అధికారం చేపట్టడం ఖాయమైంది. కాగా ఈ కూటమిలో టీడీపీతో పాటుగా బీజేపీ, జనసేన పార్టీలు కూడా భాగమే అన్న విషయం తెలిసిందే. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 21 చోట్ల పోటీ చేసిన జనసేన అన్ని స్థానాల్లో గెలుపొందింది. వీరిలో ఆ పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు చిత్ర పరిశ్రమ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

అత్యధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్ ఘనవిజయం
10 ఏళ్ల కష్టం.. ఈ పదేళ్లలో ఎన్నో అవమానాలు అయినా కూడా ఎక్కడా బెదరకుండా అలుపెరుగని కృషితో ఫైనల్ గా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నేడు ఏపీ ఎన్నికల ఫలితాలు అన్న సంగతి తెలిసిందే కదా. ఈరోజు కోసం ఎప్పటినుండో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. నేడు ఆరోజు రానే వచ్చేసింది. అందరూ ఫలితాలను ఎంతో ఆసక్తికరంగా చూస్తున్నారు.

పవన్ విజయంపై నితిన్ ఎమోషనల్ పోస్ట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రస్తుతం సంబరాల్లో మునిగిపోయి ఉన్నారు. దీనికి కారణం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమైపోయింది. ఈనేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగితేలుతున్నారు. ఇక టాలీవుడ్ లో కూడా పలువురు యంగ్ హీరోలు పవన్ కు అభిమానులే అన్న సంగతి తెలిసిందే. వారిలో నితిన్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఈనేపథ్యంలో ఇప్పుడు నితిన్ కూడా పవన్ స్టార్ విజయంపై తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ఎమోషన్ పోస్ట్ చేశాడు.

రిలీజ్‌కి సిద్ధమైన మనమే.. సెన్సార్ పూర్తి
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'మనమే'. రొమాంటిక్ ప్లస్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుధీర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

OG నుండి పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్- పవన్ టైమ్ బిగిన్స్
ఏపీ ప్రజలందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చేసింది. నేడు ఎన్నికలు ఫలితాలు కావడంతో ప్రజలందరూ ఫలితాల కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. దాదాపు ఎన్డీయే కూటమి విజయ కేతనం ఎగిరే దిశగా పరుగులు పెడుతుంది. ఇక ఈ ఎన్నికల్లో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది ఎవరంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పిఠాపురం నియోజక వర్గం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో దేశవ్యాప్తంగా ఆ నియోజకవర్గం పేరు మారు మ్రోగిపోయింది. అంతేకాదు పవన్ మెజార్టీపైన కూడా ఎన్నో చర్చలు జరిగాయి.. బెట్టింగ్ లు జరిగాయి కూడా. ఇప్పుడు అదే నిజం చేస్తూ వంగా గీత పై భారీ మెజార్టీతో అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నాడు పవర్…