మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి యూఎస్ఏ లో హిట్ దిశగా దూసుకుపోతుంది.నిన్నటి తో అక్కడ 250k డాలర్ల మార్క్ ను చేరుకుంది. యూఎస్ఏ లో ఈసినిమాను కాగ్నెర్ సినీ క్రియేషన్స్ రిలీజ్ చేసింది. ఈవారంలో ఈ సినిమా అక్కడ సేఫ్ జోన్ లోకి చేరుకోనుంది.ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈసినిమా బ్రేక్ ఈవెన్ కు చేరువైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫస్ట్ వీకెండ్ సాలిడ్ వసూళ్లను రాబట్టుకొని 80శాతం బిజినెస్ రికవరీ చేయగా వర్కింగ్ డేస్ లోకూడా స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగిస్తోంది. దాంతో మరో కోటి రూపాయల షేర్ రాబడితే టార్గెట్ ను చేరుకున్నట్లే.ఓవరాల్ గా 5రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి 19కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.
రూరల్ బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టార్ డ్రామా గా తెరకెక్కిన ఈసినిమాలో విశ్వక్ యాక్టింగ్, సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫైట్స్ హైలైట్ అయ్యాయి.కృష్ణ చైతన్య ఈసినిమాను డైరెక్ట్ చేయగా నేహా శెట్టి, అంజలి హీరోయిన్లు గా నటించారు.యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.ఇక ఈసినిమా హిట్ అవ్వడంతో దీనికి సీక్వెల్ కూడా రానుంది.గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి 2 టైటిల్ తో సీక్వెల్ తెరకెక్కనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























