గత ఏడాది జైలర్ తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు సూపర్ స్టార్ రజినీకాంత్.ఈసినిమా తరువాత రీసెంట్ గా లాల్ సలామ్ తో ప్రేక్షకులముందుకు వచ్చాడు అయితే ఇందులో హీరోగా కాదు ఓ కీలక పాత్రలో మాత్రమే కనిపించాడు.ఇక రజనీ హీరోగా రెండు రోజుల క్రితం వేట్టైయన్ అనే సినిమాను పూర్తి చేశాడు.జై భీం ఫేమ్ టిజి జ్ఞానవేల్ డైరెక్ట్ చేస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.అక్టోబర్ 10న ఈసినిమా విడుదలకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా తరువాత రజినీకాంత్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో సినిమా చేయనున్నాడని తెలిసిందే.ఆల్రెడీ ఫస్ట్ లుక్ తోపాటు టైటిల్ ను కూడా ప్రకటించేశారు.యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈసినిమాకు కూలీ అనే టైటిల్ ను ఖరారు చేశారు.ఇక ఈసినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది.జూన్ 10నుండి ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం.
రజినీని ఈసినిమాలో స్టైలిష్ గా చూపించనున్నాడు లోకేష్ కనగరాజ్.అనిరుధ్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది విడుదలకానుంది. ఇక ఈసినిమా తర్వాత రజినీ కాంత్, జైలర్ 2 లో నటించనున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























