పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రస్తుతం సంబరాల్లో మునిగిపోయి ఉన్నారు. దీనికి కారణం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమైపోయింది. ఈనేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగితేలుతున్నారు. ఇక టాలీవుడ్ లో కూడా పలువురు యంగ్ హీరోలు పవన్ కు అభిమానులే అన్న సంగతి తెలిసిందే. వారిలో నితిన్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఈనేపథ్యంలో ఇప్పుడు నితిన్ కూడా పవన్ స్టార్ విజయంపై తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ఎమోషన్ పోస్ట్ చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
డియర్ పవన్ కళ్యాణ్ గారు.. ఈ ఎన్నికల్లో కూటమిని గెలిపించడం కోసం మీరు చేసిన కృషికి నేను ఓ అభిమానిగా, సోదరుడిగా ఎంతో సంతోషిస్తున్నాను. నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఈ విజయం కోసం మీరెంతో పోరాడారు. ఈ విజయానికి మీరు అర్హులు. మీకు మరింత ‘పవర్’ దక్కాలి అని కోరుకుంటున్నాను అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు. ఇంకా హరీశ్ శంకర్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పవన్ కల్యాణ్ కు అభినందలు తెలిపారు.
Dearest @PawanKalyan garu.. As a fan and as a brother, I am supremely thrilled and overjoyed at your history making win in this election and the way you have Powered the alliance to the Top! Can’t express my happiness enough as emotions are taking over. But what a fantastic hard…
— nithiin (@actor_nithiin) June 4, 2024
కాగా ఇప్పటికే రీఎంట్రీ తరువాత వరుసగా వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో సినిమాలతో బ్లాక్ బస్టర్ లను సొంతం చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సుజీత్ దర్శకత్వంలో రాబోతున్న ఓజీ సినిమా ఒకటి ఇంకా క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న హరిహర వీరమల్లు సినిమా ఒకటి. ఈ మూడు సినిమాలు కూడా షూటింగ్ దశలోనే ఉన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























