పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్

Allu Arjun Congratulates Janasena Chief Pawan Kalyan

2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. తెలుగుదేశం పార్టీ కూటమి అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని అధికారం చేపట్టడం ఖాయమైంది. కాగా ఈ కూటమిలో టీడీపీతో పాటుగా బీజేపీ, జనసేన పార్టీలు కూడా భాగమే అన్న విషయం తెలిసిందే. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 21 చోట్ల పోటీ చేసిన జనసేన అన్ని స్థానాల్లో గెలుపొందింది. వీరిలో ఆ పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు చిత్ర పరిశ్రమ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన ఆయన అందులో.. “ఈ అద్భుతమైన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక అభినందనలు. సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేయాలనే మీ కృషి, అంకితభావం మరియు నిబద్ధత ఎల్లప్పుడూ హృదయాన్ని హత్తుకునేవి. ప్రజలకు సేవ చేసే మీ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు” అని పేర్కొన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.