ఏపీ ప్రజలందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చేసింది. నేడు ఎన్నికలు ఫలితాలు కావడంతో ప్రజలందరూ ఫలితాల కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. దాదాపు ఎన్డీయే కూటమి విజయ కేతనం ఎగిరే దిశగా పరుగులు పెడుతుంది. ఇక ఈ ఎన్నికల్లో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది ఎవరంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పిఠాపురం నియోజక వర్గం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో దేశవ్యాప్తంగా ఆ నియోజకవర్గం పేరు మారు మ్రోగిపోయింది. అంతేకాదు పవన్ మెజార్టీపైన కూడా ఎన్నో చర్చలు జరిగాయి.. బెట్టింగ్ లు జరిగాయి కూడా. ఇప్పుడు అదే నిజం చేస్తూ వంగా గీత పై భారీ మెజార్టీతో అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నాడు పవర్ స్టార్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ సినిమాల నుండి స్పెషల్ పోస్టర్లు వచ్చేస్తున్నాయి. దీనిలో భాగంగానే తాజాగా తను నటిస్తున్న ఓజీ సినిమా నుండి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఓజీ టైమ్ బిగిన్స్ అంటూ పవన్ కుర్చీలో కూర్చున్న పవర్ ఫుల్ పోస్టర్ ను రిలీజ్ చేయగా ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Brand new poster from team #OG ⚡️🔥#TheyCallHimOG#PawanKalyan #TeluguFilmNagar pic.twitter.com/JbAzKjm7OZ
— Telugu FilmNagar (@telugufilmnagar) June 4, 2024
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో ఓజీ సినిమా వస్తుంది. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించనున్నాడు సుజీత్. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ పూర్తయింది. ఈసినిమాలో ప్రియాంక అరుళ్ హీరోయిన్ గా నటిస్తుంది. అర్జున్ దాస్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. రవి..కె.చంద్రన్ డీవోపీ అందిస్తున్నారు. తెలుగు తోపాటు హిందీ, మలయాళం, తమిళ్ మరియు కన్నడ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకి సిద్ధమవుతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: