వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా రాబోతున్న సినిమా సరిపోదా శనివారం ఒకటి. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న రెండో సినిమా ఇది. ఈసినిమాలో నాని కంప్లీట్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో అలరించనున్నాడు. ఇప్పటికే ఈసినిమా టైటిల్ తో పాటు గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా నుండి అప్ డేట్ వచ్చి చాలా కాలమే అయిపోయింది. అయితే ఇప్పుడు తాజాగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తోంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. దీని కోసం హైదరాబాద్ లో ఒక భారీ సెట్ కూడా వేశారట. ఈ భారీ సెట్ లోనే యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారట. 10 రోజుల పాటు ఈ షూట్ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఇందులో నాని చేసే యాక్షన్ సీక్వెన్స్ లు నెక్ట్స్ లెవెల్ లో ఉంటాయని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ ను ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ లు కొరియోగ్రాఫ్ చేస్తున్నారు.
కాగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో తమిళ్ టాలెంటెడ్ నటుడు ఎస్ జే సూర్య కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, మురళి జి సినిమాటోగ్రాఫర్, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్. ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: