మొత్తానికి అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసిన ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఆంధ్రప్రదేశ్ లో కూటమి (తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ) ఘన విజయం సాధించింది. టీడీపీ 130 సీట్లను, జనసేన 21 సీట్లు, బీజేపీ 8 సీట్లను దక్కించుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పటికే వీరి గెలుపుపై ఎంతో మంది రాజీకయ ప్రముఖుల దగ్గర నుండి సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియచేసారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరిపోయారు. తాజాగా ఎన్టీఆర్ తన ట్విట్టర్ ద్వారా ఏపీ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. ప్రియమైన సీబీఎన్ మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు… మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన లోకేశ్ కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన శ్రీ భరత్, పురంధరేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు అంటూ తన పోస్ట్ లో పేర్కొన్నారు. అలాగే ఇంతటి ఘనవిజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ తెలియచేశారు.
ప్రియమైన @ncbn మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు… మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను.
అద్భుతమైన మెజారిటీతో గెలిచిన @naralokesh కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, MPలుగా…
— Jr NTR (@tarak9999) June 5, 2024
అలాగే ఇంతటి ఘనవిజయం సాధించిన @PawanKalyan గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
— Jr NTR (@tarak9999) June 5, 2024
కాగా ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈసినిమా షూటింగ్ ను ముంగించుకునే పనిలో ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు. ఇంకా బాలీవుడ్ లో వార్ 2 సినిమా కూడా చేస్తున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: