పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షల వెల్లువ

Janasena Chief Pawan Kalyan Receives Wishes From Celebrities After Win in AP Elections

తెలుగు రాష్ట్రాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కూటమి ఘనవిజయం సాధించింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గానూ అత్యధిక స్థానాలు (164) కైవసం చేసుకుని అధికారం పీఠం దక్కించుకుంది. కాగా ఈ కూటమిలో టీడీపీతో పాటుగా బీజేపీ, జనసేన పార్టీలు కూడా భాగమే అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ రికార్డు విజయం నమోదుచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ క్రమంలో మొత్తం 21 అసెంబ్లీ స్థానాలు మరియు 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయగా.. 100 శాతం సక్సెస్ రేటుతో అన్నింటిలో విజయదుందుభి మ్రోగించింది. ఇలా ఒక పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొందడం దేశవ్యాప్తంగా ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక ఆ పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ స్వయంగా పిఠాపురం నియోజకవర్గంలో బరిలో నిలిచి 70 వేలకు పైగా భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించడం విశేషం.

ఈ నేపథ్యంలో జనసేనానికి చిత్ర పరిశ్రమ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఆయన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి, మెగా ఫ్యామిలీ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలియజేసిన విషయం తెలిసిందే. ఇదేక్రమంలో టాలీవుడ్ నుంచే కాకుండా ఇతర చిత్ర పరిశ్రమల లోని పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీరిలో కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్, డైరెక్టర్ కం యాక్టర్ ఎస్.జే. సూర్య, కాజల్ అగర్వాల్ తదితరులు ఉన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.