నందమూరి బాలకృష్ణ హీరోగా బాబి దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతానికి ఎన్బీకే 109 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక బాలకృష్ణ వరుస హిట్ల తరువాత, అలానే బాబి వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లను, అలానే గ్లింప్స్ ను రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్సే సొంతం చేసుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అయితే వినిపిస్తుంది. ఈసినిమా నుండి సెకండ్ గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది. సెకండ్ గ్లింప్స్ ను జూన్ 10వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. తాజాగా మరో వార్త తెరపైకి వచ్చింది. మేకర్స్ సాలిడ్ అండ్ పవర్ ఫుల్ గ్లింప్స్ ను రెడీ చేశారని.. ఈ గ్లింప్స్ ఫ్యాన్స్ కు ఫుల్ హ్యాపీని ఇస్తుందని అంటున్నారు. మరి సెకండ్ గ్లింప్స్ ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సింది..
కాగా ఈసినిమాలో బాబి డియోల్, ఊర్వశి రౌతేలా, చాందినీ చౌదరి, షైన్ టామ్ చాకో పలు కీలక పాత్రల్లో నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: