మనమే రన్ టైమ్ లాక్

sharwanand manamey movie run time locked

శర్వానంద్ హీరోగా దాదాపు రెండేళ్ల తరువాత వస్తున్న సినిమా మనమే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రొమాంటిక్ ప్లస్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఈసినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుక రానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బీజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ సినిమాపై అంచనాలను పెంచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. రెండు రోజుల క్రితమే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకోగా ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ ను అందించారు సెన్సార్ బృందం. ఇప్పుడు ఈసినిమా రన్ టైమ్ ను కూడా లాక్ చేసుకుంది. 2 గంటల 35 నిమిషాల నిడివి ఈసినిమాకు లాక్ అయింది.

ఇంకా ఈసినిమాలో విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, అయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నాడు. విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రాఫి అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.