విజ‌నరీ చంద్రబాబుకి శుభాకాంక్షలు – రామ్ చ‌ర‌ణ్

Ram Charan Congratulates TDP Chief Chandrababu Over Victory in AP Elections

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే (టీడీపీ+జనసేన+బీజేపీ) కూటమి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఈ ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ ఒకే కూటమిగా పోటిచేయ‌గా.. అధికార వైఎస్సార్సీపీ ఒంటరిగా పోటీ చేసింది. ఈ క్రమంలో ఎన్డీయే కూటమి ఏకంగా 164 సీట్లు గెలిచి సంచలన విజయం నమోదు చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ విజయంపై టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకు శుభాకాంక్ష‌లు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా.. “అద్భుతమైన విజయం సాధించిన విజ‌నరీ లీడ‌ర్ చంద్రబాబు గారికి శుభాకాంక్షలు” అని చరణ్ పేర్కొన్నారు.

ఇక ఇదిలావుండగా.. సినిమాల విషయానికొస్తే, రామ్ చ‌ర‌ణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్‌’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆయనకు జోడీగా కైరా అద్వానీ హీరోయిన్‍గా నటిస్తోంది. ఈ మూవీని ఈ ఏడాది సెప్టెంబర్‌లో రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇక దీని తర్వాత ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా డైరెక్షన్‍లో ‘ఆర్‌సీ 16’లో నటించనున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. కాగా ఈ రెండు సినిమాలపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.