టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మనమే’. రొమాంటిక్ ప్లస్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుధీర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్‌గా నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మురం చేసింది. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ టీజర్ అన్నీ కూడా సినిమాపై మంచి ఫీల్ క్రియేట్ చేశాయి. అలాగే ‘నా మాటే’, ‘మనమే’, ‘టప్పా టప్పా’ అనే మూడు పాటలను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ క్రమంలో తాజాగా ‘మనమే’ నుండి మరో కీలక అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ మూవీకి U/A సర్టిఫికేట్ అందించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కాగా ఈ సినిమాకు ‘నాన్న’ ఫేమ్ హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తుండగా.. విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.
#Manamey 𝑪𝒆𝒏𝒔𝒐𝒓𝒆𝒅 with 𝑼/𝑨 🥳, Bringing the Fun & Entertainment WW on June 7th! ❤️🔥#ManameyTrailer
👉 https://t.co/s5TqgbepIXBookings Opening Soon ~ In Cinemas #ManameyOnJune7th ✨ @ImSharwanand @IamKrithiShetty @SriramAdittya @vishwaprasadtg @HeshamAWMusic… pic.twitter.com/OWgMUTqFjF
— People Media Factory (@peoplemediafcy) June 4, 2024
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: