
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 136


అశ్విన్ బాబు శివం భజే రిలీజ్ డేట్ ఫిక్స్

కల్కి నుండి మృణాల్ లుక్ రిలీజ్

సర్దార్ 2 షూటింగ్ కు డేట్ ఫిక్స్

మాట నిలబెట్టుకున్న బేబి నిర్మాత

కపుల్ ఫ్రెండ్లీ అంటున్న సంతోష్ శోభన్

అఫీషియల్.. RC16లో శివన్న

ధనుష్ కి జోడీ గా యానిమల్ హీరోయిన్

వార్ 2 ఇండియాలో బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ

ఫ్యామిలీతో ముంబైకి రామ్ చరణ్.. ఎందుకంటే..?

ఇండియన్ 2 కి ఎక్స్ లెంట్ అడ్వాన్స్ బుకింగ్స్

తిరగబడరసామీ రిలీజ్ డేట్ ఫిక్స్

సరిపోదా శనివారం-సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

పుష్ప 2 తమిళనాడులో రిలీజ్ చేసేది ఎవరంటే..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్ లో నటిస్తోన్న ఇండియాస్ మోస్ట్ ఎవైటెడ్ చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టుపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ 'పుష్ప-ది రైజ్'కి సీక్వెల్‌గా రూపొందుతోన్న విషయం తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్ లోనే వచ్చిన ఈ సినిమా సంచలన విజయం నమోదు చేసింది. దేశంలోని అన్ని ప్రధాన భాషల్లో డబ్ అయి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

సంతోష్ శోభన్ న్యూ మూవీఇంటెన్స్ పోస్టర్ రిలీజ్
ఇక నేడు సంతోష్ శోభన్ పుట్టిన రోజు కావడంతో ఆయన సినిమాల నుండి వరుసగా అప్ డేట్లు ఇస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈరోజు ఉదయం అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా అప్ డేట్ వచ్చింది . ఈసినిమా టైటిల్ తో పాటు చిన్న గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. కపుల్ ఫ్రెండ్లీ అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. గ్లింప్స్ కూడా ఆకట్టుకుంది. వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. కాగా ఈసినిమా యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై అజయ్ కుమార్ రాజు నిర్మిస్తున్నారు. దినేష్ పురుషోత్తం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తుండగా.. ఆదిత్య…

అశ్విన్ బాబు శివం భజే రిలీజ్ డేట్ ఫిక్స్
రాజు గారి గది సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకున్నాడు యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు. ఇక ఆతరువాత పలు సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా శివం భజే. అప్సర్ దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు చిత్రయూనిట్ అప్పుడప్పుడు ఈసినిమా అప్ డేట్స్ ను ఇస్తూనే ఉన్నారు.

G2 గురించి త్వరలో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ - అడివి శేష్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం 'G2'. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నారు. అద్భుతమైన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో బనితా సంధు హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఇది బనితాకు మొదటి పాన్ ఇండియా చిత్రం కానుంది. ఇంతకుముందు ఆమె అక్టోబర్, సర్దార్ ఉదం, తమిళ చిత్రం ఆదిత్య వర్మ వంటి చిత్రాలలో నటించింది.

అంబానీ ఇంట పెళ్లి సందడి.. ఫ్యామిలీతో ముంబైకి మహేష్ బాబు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు శుక్రవారం ముంబై పయనమయ్యారు. ఆయన వెంట సతీమణి నమ్రతా శిరోద్కర్, కుమార్తె సితార ఘట్టమనేని కూడా ఉన్నారు. అంబానీల ఇంట జరుగుతున్న వివాహ వేడుకలో పాల్గొనేందుకు వారు ఈ మధ్యాహ్నం ముంబై బయలుదేరారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వీడియోలలో మహేష్ బాబు స్టైలిష్ లుక్‌తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు.

కల్కి నుండి మృణాల్ లుక్ రిలీజ్
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా కల్కి 2898ఏడీ. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక అంచనాలను నిజం చేస్తూ ఈసినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పురాణాలను భవిష్యత్‌ను కలుపుతూ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. నటీనటుల నటన, వావ్ అనిపించేలా విజువల్స్, వీఎఫ్‌ఎక్స్ మరియు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ వంటి అంశాలు ఈ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. ఇక ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ విషయంలో ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో చూస్తున్నాం. ఇప్పటికే 1000 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. అంతేకాదు ఇప్పటికే అన్ని చోట్లా…

సర్దార్ 2 షూటింగ్ కు డేట్ ఫిక్స్
యుగానికి ఒక్కడు సినిమాతోనే తనలో మంచి నటుడిని పరిచయం చేశాడు తమిళ్ టాలెంటెడ్ నటుడు కార్తీ. ఆ తరువాత పలు సినిమాలు చేసినా ఆవారా సినిమాతో తెలుగు లో కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. దాంతో కార్తి నుండి ఏసినిమా వచ్చినా తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటారు. ఖైదీ, సర్దార్, పొన్నియన్ సెల్వన్ సినిమాలతో మంచి హిట్లను తన ఖాతాలో వేసుకున్న కార్తికి జపాన్ తో పరాజయం ఎదురైంది.

భారతీయుడు 2 తెలుగు రివ్యూ
ఓవరాల్ గా భారీ అంచనాల మధ్య వచ్చిన భారతీయుడు 2 అంచనాలను అందుకుందనే చెప్పొచ్చు.కమల్ హాసన్ యాక్టింగ్, శంకర్ టేకింగ్, విజువల్స్ హైలైట్ అయ్యాయి. సాలిడ్ మెసేజ్ తో వచ్చిన ఈ సినిమాను అందరూ చూడొచ్చు.

మాట నిలబెట్టుకున్న బేబి నిర్మాత
మే 13వ తేదీన జరిగిన ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ సీట్లతో గెలిచిన విషయం తెలిసిందే కదా. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేయగా.. కూటమి ఘన విజయం సాధించింది. ఇక ఈ కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ జనసేన తీసుకున్న 21 అసెంబ్లీ సీట్లను గెలుచుకొని మరొక రికార్డును క్రియేట్ చేసింది. అంతేకాకుండా కూటమి విజయానికి ఒక పిల్లర్ గా నిలిచాడు.

కపుల్ ఫ్రెండ్లీ అంటున్న సంతోష్ శోభన్
గోల్కొండ హైస్కూల్ సినిమాలో ఒక పాత్రలో నటించి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు సంతోష్ శోభన్. ఆతరువాత తను నేను, పేపర్ బాయ్, ఏక్ మిని కథ, మంచి రోజులు వచ్చాయి, లైక్ షేర్ సబ్ స్క్రైబ్, అన్నీ మంచి శకునములే, ప్రేమ్ కుమార్ ఇలా వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చాడు కానీ సాలిడ్ హిట్ అనేది మాత్రం ఇంతవరకూ దక్కలేదు. అయినా కూడా ఎక్కడా తగ్గకుండా విఫల ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.

అఫీషియల్.. RC16లో శివన్న
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న 'గేమ్ ఛేంజర్'లో నటిస్తున్న ఆయన, దీని తరువాత 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానాతో కలిసి ఒక క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం దీనిని #RC16 అనే వర్కింగ్ టైటిల్‌తో వ్యవహరిస్తున్నారు. క్రీడా కథాంశం నేపథ్యంలో రూపొందనున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీగానే అంచనాలున్నాయి.

ఫిలింఫేర్ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు చిత్రాలివే..!
2023వ సంవత్సరానికి గానూ 68వ సౌత్ ఇండియా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ప్రకటించారు. ఈ మేరకు తాజాగా ప్రకటించిన అవార్డుల్లో కొన్ని తెలుగు చిత్రాలు సత్తా చాటాయి. వీటిలో ప్రధానంగా ఆర్ఆర్ఆర్, సీతారామం, విరాట పర్వం సినిమాలు వివిధ విభాగాల్లో పలు అవార్డులను గెలుచుకున్నాయి. కాగా గతేడాది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అందుకున్న ఆర్ఆర్ఆర్ సౌత్ ఇండియా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లోనూ అనేక అవార్డులను కొల్లగొట్టింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ డైరెక్టర్ వంటి వాటితోపాటు మొత్తం ఏకంగా 7 విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది.

ఫిలింఫేర్ అవార్డ్స్.. ఉత్తమ నటులుగా ఎన్టీఆర్, రామ్ చరణ్
'ఆర్ఆర్ఆర్' చిత్రంతో గ్లోబల్ రేంజ్‌లో పాపులర్ అయ్యారు మన టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇందులో తెలుగు గడ్డకు చెందిన స్వాతంత్య్ర సమరవీరులు కొమురం భీముడు పాత్రలో ఎన్టీఆర్.. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ అద్భుత నటనను ప్రదర్శించారు. ఈ చిత్రంలోని 'నాటు నాటు' పాట ఏకంగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.

ధనుష్ కి జోడీ గా యానిమల్ హీరోయిన్
యానిమల్ తో ఫేమ్ తెచ్చుకుంది తృప్తి డిమ్రి.ఇందులో ఆమె గ్లామర్ కి యూత్ ఫిదా అయ్యింది దాంతో నేషన్ వైడ్ గా పాపులర్ అయ్యింది.ఇక ఇప్పుడు మరో ఆఫర్ కొట్టేసింది తృప్తి.సౌత్ హీరో ధనుష్ సరసన తృప్తి డిమ్రి నటించనుందని సమాచారం.ధనుష్ హిందీలో తేరే ఇష్క్ మే అనే సినిమా చేస్తున్నాడు.ప్రముఖ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ ఈసినిమాను డైరక్ట్ చేస్తుండగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.ఈసినిమాకోసం తృప్తి డిమ్రిని హీరోయిన్ గా తీసుకున్నారట.అయితే ఈ విషయంలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సివుంది.

విజయ్ ది గోట్- విజిల్ ఏస్కో సాంగ్ ప్రోమో రిలీజ్
దళపతి విజయ్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకునే పనిలో ఉంది.

వార్ 2 ఇండియాలో బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా వస్తున్న సినిమా వార్2. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా వచ్చిన వార్ సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఇక ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా ముగించుకుంటుంది. ఈసినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ పై నిర్మిస్తున్నారు. 2025 ఇండిపెండెన్స్ సందర్భంగా ఆగష్ట్ 14వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఫ్యామిలీతో ముంబైకి రామ్ చరణ్.. ఎందుకంటే..?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురువారం ముంబైలో మెరిశాడు. ఈ మేరకు సతీమణి ఉపాసన, కుమార్తె క్లిన్‌కారాతో కలిసి ముంబై చేరుకున్న ఆయనను స్థానిక మీడియా కెమెరాల్లో బంధించింది. అయితే ఇలా సడెన్‌గా ఫ్యామిలీతో కలిసి చరణ్ ముంబై వెళ్ళడానికి కారణం ఏంటంటే..? అంబానీల ఇంట వివాహ వేడుకలో పాల్గొనేందుకు వారు ముంబై చేరుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అంతకుముందు రామ్ చరణ్ ముంబై బయలుదేరుతున్న విజువల్స్ ట్రెండింగ్‍లో నిలిచాయి.

ఇండియన్ 2 కి ఎక్స్ లెంట్ అడ్వాన్స్ బుకింగ్స్
మచ్ అవైటెడ్ సీక్వెల్ ఇండియన్ 2 రేపు థియేటర్లలోకి రానుంది.శంకర్ - కమల్ హాసన్ కాంబో లో వస్తున్న ఈసినిమా పై తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా భారీ అంచనాలు వున్నాయి.ఇక ఈసినిమా అడ్వాన్స్ బుకింగ్స్ విషయం లో అదరగొడుతుంది.ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 25 కోట్ల అడ్వాన్స్ సేల్స్ జరిగాయని సమాచారం.బుక్ మై షో లో నిన్నటి వరకు తమిళ్,తెలుగు కలిపి 2లక్షల 80వేలకు కుపైగా టికెట్స్ బుక్ అయ్యాయి.ఈసినిమాతో కమల్ కు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోనున్నాడు.

తిరగబడరసామీ రిలీజ్ డేట్ ఫిక్స్
యంగ్ హీరో రాజ్ తరుణ్ అప్ కమింగ్ మూవీ తిరగబడరసామీ రిలీజ్ డేట్ ను లాక్ చేశారు మేకర్స్.ఆగస్టు 2న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.ఏ ఎస్ రవికుమార్ చౌదరి డైరెక్ట్ చేయగా మాల్వి మల్హోత్ర హీరోయిన్ గా నటించింది.రీసెంట్ గా ట్రైలర్ కూడా బయటికి వచ్చింది.గొడవలకు భయపడే హీరో తన ప్రేయసి కి కష్టం వస్తే ఎలా తిరగబడ్డాడు అనే కాన్సెప్ట్ తో వస్తుంది.ఈసినిమాతో యాక్షన్ జోనర్ ను ట్రై చేస్తున్నాడు రాజ్ తరుణ్.జేబీ సంగీతం అందిస్తుండగా మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నాడు.

సరిపోదా శనివారం-సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
న్యాచురల్ స్టార్ నాని నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తి చేసుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. దీనిలో భాగంగానే వరుసగా అప్ డేట్లు ఇస్తూ వస్తున్నారు. రీసెంట్ గానే నాని సెకండ్ లుక్ అలానే ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు నిన్న ఈసినిమా నుండి స్పెషల్ మేకింగ్ షాట్స్ వీడియోను రిలీజ్ చేశారు.