యంగ్ హీరో రాజ్ తరుణ్ అప్ కమింగ్ మూవీ తిరగబడరసామీ రిలీజ్ డేట్ ను లాక్ చేశారు మేకర్స్.ఆగస్టు 2న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.ఏ ఎస్ రవికుమార్ చౌదరి డైరెక్ట్ చేయగా మాల్వి మల్హోత్ర హీరోయిన్ గా నటించింది.రీసెంట్ గా ట్రైలర్ కూడా బయటికి వచ్చింది.గొడవలకు భయపడే హీరో తన ప్రేయసి కి కష్టం వస్తే ఎలా తిరగబడ్డాడు అనే కాన్సెప్ట్ తో వస్తుంది.ఈసినిమాతో యాక్షన్ జోనర్ ను ట్రై చేస్తున్నాడు రాజ్ తరుణ్.జేబీ సంగీతం అందిస్తుండగా మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రాజ్ తరుణ్ ప్రస్తుతం మరో రెండు సినిమాలు చేస్తున్నాడు.అందులో పురుషోత్తముడు ఒకటి.రామ్ భీమన డైరెక్ట్ చేస్తుండగా హాసిని హీరోయిన్ గా నటిస్తుంది.గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.షూటింగ్ కూడా పూర్తి కావొచ్చింది.ఇది కూడా యాక్షన్ ఎంటర్టైనర్ గానే వస్తుంది. ఇది కాకుండా భలే ఉన్నాడే అనే సినిమా కూడా చేస్తున్నాడు రాజ్ తరుణ్.మారుతి ఈసినిమాకు ఓ నిర్మాత గా వ్యవహరిస్తున్నాడు.రీసెంట్ గా వచ్చిన టీజర్ హిలేరియస్ అనిపించుకుంది.మరి చాలా రోజుల నుండి హిట్ కోసం ఎదురుచూస్తున్న రాజ్ తరుణ్ కు ఈ మూడు సినిమాలు హ్యాట్రిక్ ఇస్తాయో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: