యుగానికి ఒక్కడు సినిమాతోనే తనలో మంచి నటుడిని పరిచయం చేశాడు తమిళ్ టాలెంటెడ్ నటుడు కార్తీ. ఆ తరువాత పలు సినిమాలు చేసినా ఆవారా సినిమాతో తెలుగు లో కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. దాంతో కార్తి నుండి ఏసినిమా వచ్చినా తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటారు. ఖైదీ, సర్దార్, పొన్నియన్ సెల్వన్ సినిమాలతో మంచి హిట్లను తన ఖాతాలో వేసుకున్న కార్తికి జపాన్ తో పరాజయం ఎదురైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు మరో సినిమాతో బిజీ అవ్వబోతున్నాడు కార్తి. కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో సర్తార్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. వాటర్ మాఫియా, ప్లాస్టిక్ బాటిల్స్ లో నీరు త్రాగడం వల్ల ప్రజలకు ఎదురవుతున్న సమస్యలు, తాగు నీటి విలువ గురించి ఈసినిమాలో చూపించగా.. ఈసినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఈసినిమాకు సీక్వెల్ వస్తుందని ఇప్పటికే ప్రకటించిన సంగతి కూడా విదితమే. ఈసినిమా పూజా కార్యక్రమం ఇటీవలే చెన్నైలో జరిగింది. ఇప్పుడు ఈసినిమా నుండి మరో అప్ డేట్ వచ్చింది. ఈసినిమా షూటంగ్ ను జులై 15వ తేదీ నుండి ప్రారంభించనున్నట్టు తెలిపారు. చెన్నైలో వేసిన భారీ సెట్‌లో సర్దార్ 2 షూటింగ్ కొనసాగనున్నట్టు తెలియచేశారు.
కాగా ఈసినిమాను ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా.. జార్జి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























