ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్ లో నటిస్తోన్న ఇండియాస్ మోస్ట్ ఎవైటెడ్ చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టుపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ ‘పుష్ప-ది రైజ్’కి సీక్వెల్గా రూపొందుతోన్న విషయం తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్ లోనే వచ్చిన ఈ సినిమా సంచలన విజయం నమోదు చేసింది. దేశంలోని అన్ని ప్రధాన భాషల్లో డబ్ అయి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్, ఫస్ట్ సింగిల్ నెట్టింట రికార్డు వ్యూస్ సాధించి సెన్సేషన్ సృష్టించాయి. ఈ నేపథ్యంలో పుష్ప 2 రిలీజ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో రిలీజ్ కానున్న ఈ చిత్రం డిసెంబర్ 6న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి ఒక సాలిడ్ అప్డేట్ వచ్చింది. పుష్ప 2 తమిళ్ వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ను కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ AGS ఎంటర్ టైన్మెంట్ దక్కించుకుంది. ఈ మేరకు విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు.
కాగా ‘పుష్ప 2’ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా.. సునీల్, రావు రమేష్, అనసూయ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా చేస్తుండగా.. టాలీవుడ్ సీనియర్ నటులు జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. టాలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మరియు డైరెక్టర్ హోం బ్యానర్ సుకుమార్ రైటింగ్స్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























