మాట నిలబెట్టుకున్న బేబి నిర్మాత

baby movie producer skn gifts auto to pithapuram woman mariyamma

మే 13వ తేదీన జరిగిన ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ సీట్లతో గెలిచిన విషయం తెలిసిందే కదా. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేయగా.. కూటమి ఘన విజయం సాధించింది. ఇక ఈ కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ జనసేన తీసుకున్న 21 అసెంబ్లీ సీట్లను గెలుచుకొని మరొక రికార్డును క్రియేట్ చేసింది. అంతేకాకుండా కూటమి విజయానికి ఒక పిల్లర్ గా నిలిచాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ కోసం మాటిచ్చి.. ఇప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు బేబి నిర్మాత ఎస్కేఎన్ కూడా. అసలు సంగతేంటంటే ఏపీలో ఎన్నికల సమయంలో పిఠాపురానికి చెందిన మరియమ్మ అనే మహిళ.. పవన్ కళ్యాణ్ గెలిస్తే తన భర్త రిక్షా నడపగా వచ్చిన డబ్బులతో చుట్టుపక్కల వారికి పార్టీ ఇస్తానని చెప్పింది. ఆమె చేసిన వ్యాఖ్యలు కాస్త ఎస్కేఎన్ దృష్టికి వెళ్లగా అప్పుడు అయన పిఠాపురం ఎమ్మేల్యేగా పవన్ గెలిస్తే మరియమ్మ ఫ్యామిలీకి ఆటో కొనిస్తానని చెప్పడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ కూడా భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. దీంతో బేబి నిర్మాత వారికి ఆటోని కొనిచ్చారు. ఆయనే స్వయంగా పిఠాపురం వెళ్లి ఆటోను ఆమెకు అందజేశారు.

వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో, క‌మ‌ర్షిషియ‌ల్ చిత్రాలు నిర్మిస్తూ నిర్మాత‌గా మంచి గుర్తింపు పొందాడు ఎస్కేఎన్. ఈఏడాది వచ్చిన బేబి సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. ప్రస్తుతం అయితే పలు సినిమాలు లైన్ లో ఉన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.