అంబానీ ఇంట పెళ్లి సందడి.. ఫ్యామిలీతో ముంబైకి మహేష్ బాబు

Superstar Mahesh Babu Off to Mumbai with Family to Grace Anant Ambani Wedding Ceremony

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు శుక్రవారం ముంబై పయనమయ్యారు. ఆయన వెంట సతీమణి నమ్రతా శిరోద్కర్, కుమార్తె సితార ఘట్టమనేని కూడా ఉన్నారు. అంబానీల ఇంట జరుగుతున్న వివాహ వేడుకలో పాల్గొనేందుకు వారు ఈ మధ్యాహ్నం ముంబై బయలుదేరారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వీడియోలలో మహేష్ బాబు స్టైలిష్ లుక్‌తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లైట్ పీచ్ కలర్ టీ షర్ట్, బ్లూ జీన్స్‌లో మెరిసిన మహేష్ బాబు తలపైన క్యాప్, కళ్ళకు గాగుల్స్ పెట్టుకుని కనిపించారు. మెడ క్రింది వరకూ పొడవైన జుట్టుతో అల్ట్రా మోడ్రన్ లుక్‌లో మెరిశారు. హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటినుంచీ ఇప్పటివరకూ ఆయన ఇంత పొడవైన జుట్టుతో కనిపించడం ఇదే మొదటిసారి. దీంతో సూపర్ స్టార్ అభిమానులు తమ హీరో లుక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా త్వరలో ఓ పాన్ వరల్డ్ మూవీ (వర్కింగ్ టైటిల్ – #ఎస్‌ఎస్‌ఎంబీ29) స్టార్ట్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసమే మహేష్ ఇంతకుముందెన్నడూ లేనివిధంగా ఇలా మేకోవర్ అయ్యారు. ఇందులో ఆయన ప్రపంచాన్ని చుట్టివచ్చే సాహసికుడిగా కనిపించబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. అలాగే అమెజాన్ అడవులలో ట్రెజర్ హంట్ నేపథ్యంలో ఉండొచ్చని కూడా అంటున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.

ఇకఇదిలావుంటే, భారతీయ దిగ్గజ పారిశ్రామికవేత్త, అపర కుబేరుడు ముఖేష్ అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చంట్‍తో జరుగనున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా శుక్రవారం నుంచి ఆదివారం వరకు, అంటే.. జూలై 12-14 తేదీలలో వీరి కళ్యాణ వేడుకలు జరుగనున్నాయి.

ఇక అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‍ పెళ్లి ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ వేదికగా అంగరంగ వైభవంగా జరుగనుంది. దీనిలో భాగంగా ఈరోజు ముఖ్య ఘట్టమైన ‘శుభ్ వివాహ్’ జరగనుండగా.. శనివారం ‘శుభ్ ఆశీర్వాద్’, ఆదివారం ‘మంగళ్ ఉత్సవ్’ నిర్వహించనున్నారు. ఈ వేడుకకు దేశవిదేశాల నుంచి అనేకమంది ప్రముఖులు వస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దంపతులు ముంబై చేరుకున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.