దళపతి విజయ్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకునే పనిలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా నుండి ఇప్పటికి రెండు పాటలను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. విజిల్ పొడు అంటూ వచ్చిన ఫస్ట్ సింగిల్ కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ఈమధ్య చిన్న చిన్న కంగల్ అనే రెండో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఈపాట కూడా బాగానే ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు మరో అప్ డేట్ తో వచ్చారు మేకర్స్. విజిల్ పొడు తెలుగు వెర్షన్ విజిల్ ఏస్కో పాట ప్రోమోను రిలీజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించిన ఈపాటను యువన్ శంకర్ రాజా, నకష్ అజీజ్ ఆలపించారు. ఫుల్ సాంగ్ ను రేపు జులై 12వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.
కాగా సినిమాలో విజయ్ కు జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా స్నేహ, ప్రశాంత్, ప్రభుదేవా, జైరాం, లైలా, కమెడియన్, అజ్మల్, యోగిబాబు, వైభవ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అర్చన కల్పతి నిర్మిస్తున్నారు. యువన్‌శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో సెప్టెంబర్ 5వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























