గోల్కొండ హైస్కూల్ సినిమాలో ఒక పాత్రలో నటించి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు సంతోష్ శోభన్. ఆతరువాత తను నేను, పేపర్ బాయ్, ఏక్ మిని కథ, మంచి రోజులు వచ్చాయి, లైక్ షేర్ సబ్ స్క్రైబ్, అన్నీ మంచి శకునములే, ప్రేమ్ కుమార్ ఇలా వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చాడు కానీ సాలిడ్ హిట్ అనేది మాత్రం ఇంతవరకూ దక్కలేదు. అయినా కూడా ఎక్కడా తగ్గకుండా విఫల ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక చాలా గ్యాప్ తరువాత ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నాడు. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ను ఇచ్చారు మేకర్స్ . ఈసినిమా టైటిల్ తో పాటు చిన్న గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. కపుల్ ఫ్రెండ్లీ అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ఇక గ్లింప్స్ ను చూస్తే సంతోష్ శోభన్ ఫుల్ బియర్డ్ లుక్ తో మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. అంతేకాదు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించేశారు. వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.
కాగా ఈసినిమా యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై అజయ్ కుమార్ రాజు నిర్మిస్తున్నారు. దినేష్ పురుషోత్తం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తుండగా.. ఆదిత్య రవింద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఎడిటర్ గా గణేష్ శివ వ్యవరహరించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























