మచ్ అవైటెడ్ సీక్వెల్ ఇండియన్ 2 రేపు థియేటర్లలోకి రానుంది.శంకర్ – కమల్ హాసన్ కాంబో లో వస్తున్న ఈసినిమా పై తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా భారీ అంచనాలు వున్నాయి.ఇక ఈసినిమా అడ్వాన్స్ బుకింగ్స్ విషయం లో అదరగొడుతుంది.ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 25 కోట్ల అడ్వాన్స్ సేల్స్ జరిగాయని సమాచారం.బుక్ మై షో లో నిన్నటి వరకు తమిళ్,తెలుగు కలిపి 2లక్షల 80వేలకు కుపైగా టికెట్స్ బుక్ అయ్యాయి.ఈసినిమాతో కమల్ కు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగులో కూడా పెద్ద గా ప్రమోషన్స్ లేనప్పటికీ బుకింగ్స్ బాగున్నాయి.నైజాంలో టికెట్ హైక్ తోపాటు అదనపు షో కి పర్మిషన్ వచ్చింద.అయితే ఆంధ్రా లో మాత్రం ఎలాంటి పర్మిషన్ లభించలేదు.తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమాను ఏషియన్ సినిమాస్,సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేస్తున్నాయి దాంతో థియేటర్లు కూడా బాగానే దొరకనున్నాయి.పాజిటివ్ టాక్ వస్తే తొలి రోజు ఓవరాల్ గా 50నుండి 60కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకునే ఛాన్స్ వుంది.
విక్రమ్ తరువాత కమల్ హీరోగా వస్తున్న సినిమాకూడా ఇదే.ఇందులో సిద్దార్థ్ ,రకుల్ ప్రీత్ సింగ్ ,బాబీ సింహ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.అనిరుధ్ సంగీతం అందించగా లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది.ఇక ఇండియన్ 3కూడా రానుందని తెలిసిందే.ఇండియన్ 2 స్క్రీనింగ్ చివర్లో ఇండియన్ 3 ట్రైలర్ ను ప్లే చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: