సంతోష్ శోభన్ న్యూ మూవీఇంటెన్స్ పోస్టర్ రిలీజ్

santosh shoban new movie intense poster released

ఇక నేడు సంతోష్ శోభన్ పుట్టిన రోజు కావడంతో ఆయన సినిమాల నుండి వరుసగా అప్ డేట్లు ఇస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈరోజు ఉదయం అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా అప్ డేట్ వచ్చింది . ఈసినిమా టైటిల్ తో పాటు చిన్న గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. కపుల్ ఫ్రెండ్లీ అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. గ్లింప్స్ కూడా ఆకట్టుకుంది. వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. కాగా ఈసినిమా యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై అజయ్ కుమార్ రాజు నిర్మిస్తున్నారు. దినేష్ పురుషోత్తం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తుండగా.. ఆదిత్య రవింద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఎడిటర్ గా గణేష్ శివ వ్యవరహరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు మరో సినిమాకు సంబంధించిన అప్ డేట్ కూడా వచ్చేసింది. సుమన్ పాతూరి దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా కు సంబంధించిన అఫీషియల్ అప్ డేట్ ఎప్పుడో వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా సంతోష్ శోభన్ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా నుండి ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. కొన్ని ప్రేమ కథలు జీవితకాలం వెంటాడుతాయి అంటూ ఇంటెన్స్ లుక్ తో ఉన్న పోస్టర్ అయితే ఆకట్టుకుంటుంది.

కాగా ఈసినిమాలో దేత్తడి హారిక హీరోయిన్ గా నటిస్తుంది. షార్ట్ ఫిలింస్, యూ ట్యూబ్ వీడియోస్ తో పేరు తెచ్చుకుంది హారిక. అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాత ఎస్కేఎన్, సాయి రాజేష్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సంగీతం విజయ్ బుల్గానిన్ అందిస్తున్నాడు. మరి బేబి సినిమా సంచలనం విజయం అందించింది..ఈసినిమా ఎలా ఉంటుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.