కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Tollywood Movie Updates

ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 113

Naa Favourite Naa Pellam full song out from Janaka Aithe Ganaka movie
సాంగ్

జనక అయితే గనక నుండి నా ఫేవరెట్ నా పెళ్ళాం సాంగ్ రిలీజ్

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుహాస్. హీరోగా ఏదో ఒక సినిమా కాకుండా డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ వరుస హిట్లతో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఈఏడాది ఇప్పటికే అంబాబీపేట మ్యారేజీ బ్యాండు, ప్రసన్న వదనం సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. సందీప్ రెడ్డి బండ్ల‌ దర్శకత్వంలో జనక అయితే గనక అనే టైటిల్ తో ఈసినిమా రాబోతుంది. టైటిల్ తోనే సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు.

TFN Adminవాట్సాప్
Actors Sivaji and Laya Hit Combination Returns For A New Film
సినిమా వార్తలు

శివాజీ-లయ హిట్ కాంబినేషన్ రిపీట్

ప్రముఖ నటుడు శివాజీ మళ్ళీ సినిమాలలో బిజీ అవుతున్నారు. గత బిగ్ బాస్ సీజన్ 7లో ప్రధాన కంటెస్టెంట్‍గా శివాజీ మంచి గుర్తింపు సాధించాడు. అనంతరం ఆయన ప్రధానపాత్రలో నటించిన '90's' వెబ్ సిరీస్‌లో నటించి హిట్ అందుకున్నారు. తాజాగా ఆయన, ఒకప్పటి స్టార్ హీరోయిన్ లయ హీరోహీరోయిన్లుగా ఓ సరికొత్త క్రైమ్ కామెడీ థ్రిల్లర్ రూపుదిద్దుకుంటోంది. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నం.2గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి నిర్మాత కూడా శివాజీ కావడం గమనార్హం.

Srikanth Mవాట్సాప్
Vishwak Sen's Mechanic Rocky Dubbing Begins
సినిమా వార్తలు

మెకానిక్ రాకీ డబ్బింగ్ ప్రారంభం

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్‌ సేన్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘మెకానిక్‌ రాకీ’. #VS10 ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి రైటింగ్, డైరెక్షన్ వహిస్తున్నాడు. ట్రై యాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ‘గుంటూరు కారం’ ఫేమ్ మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్‌లో కనిపించనుండగా.. మరో స్టార్ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్‌ కూడా నటిస్తోంది.

Srikanth Mవాట్సాప్
interesting update on karthikeya 3 movie
సినిమా వార్తలు

కార్తికేయ3 పై ఎగ్జైటింగ్ అప్ డేట్

చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వచ్చిన సినిమా కార్తికేయ2 ఎంత సంచలన విజయం సాధించిందో చూశాం. కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా ఈసినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈసినిమా భారీ కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ద్వారక నేపథ్యంలో కృష్ణుని కంకణం కథాంశం ఆధారంగా తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ అందరినీ ఆకట్టుకుంది. కేవలం తెలుగు ప్రేక్షకులనే కాదు నార్త్‌ అడియెన్స్‌కు కూడా నచ్చేసింది. నచ్చడమే కాదు నార్త్ లో కూడా తన సత్తా చాటి సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది.

TFN Adminవాట్సాప్
Megastar Chiranjeevi Invited For Nandamuri Balakrishna's Golden Jubilee Celebrations
సినిమా వార్తలు

బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ వేడుకలు.. మెగాస్టార్‌కు ఆహ్వానం

కనీవినీ ఎరుగని రీతిలో టాలీవుడ్‌లో ఒక హీరో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం గొప్ప విషయం. ‘తాతమ్మ కల’ చిత్రంతో తెరంగేట్రం చేసిన నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 109వ సినిమా చేస్తున్నారు. బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో ఆయన స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది.

Srikanth Mవాట్సాప్
KA First Single releasing on AUG 19th
రిలీజ్ అప్‌డేట్

క ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

రాజావారు రాణిగారుతో హీరోగా ఎంట్రీ ఇచ్చి వరసగా రెండు సక్సెస్ ల చూసిన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత నిరాశపరిచాడు.గత ఏడాది అయితే మూడు సినిమాలతో రాగ ఇందులో వినరో భాగ్యము విష్ణు కథ మాత్రమే డీసెంట్ హిట్ అనిపించుకుంది.మిగిలిన రెండు సినిమాలు మీటర్,రూల్స్ రంజన్ నిరాశపరచడంతో లాంగ్ బ్రేక్ తీసుకున్నాడు.అయితే వరస ప్లాప్ లు తగలడంతో ఈసారి రూట్ మార్చాడు కిరణ్ అబ్బవరం.

Mahender Reddyవాట్సాప్
The Goat Trailer out now
ట్రైలర్ & టీజర్

ది గోట్ ట్రైలర్ రిలీజ్

ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం) ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు విజయ్ ఫ్యాన్స్.ఇక ఎట్టకేలకు ఈరోజు ట్రైలర్ ను విడుదలచేశారు.ఈ ట్రైలర్ సినిమా అంచనాలకు తగ్గట్లే వుంది.యాక్షన్ ప్యాక్డ్ గా వచ్చిన ఈ ట్రైలర్ లో విజువల్స్,స్టంట్స్,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అయ్యాయి.ఇందులో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించనుండగా ఒకటి తండ్రి పాత్ర కాగా మరొకటి కొడుకు పాత్ర.

Mahender Reddyవాట్సాప్
Prabhas and Hanu movie begins with an auspicious pooja ceremony
సినిమా వార్తలు

ప్రభాస్ -హను రాఘవపూడి మూవీ లాంచ్

మిగితా స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేయడానికే స్ట్రగుల్ అవుతుంటే రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తున్నాడు.ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు విడుదలయ్యేలా చూసుకుంటున్నాడు.గత ఏడాది ఆది పురుష్,సలార్ తో థియేటర్లలోకి వచ్చాడు.ఇక ఈఏడాది కల్కి 2898 ఏడి రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.ఈసినిమా ఇంకా థియేటర్లలో ఆడుతుంది.

Mahender Reddyవాట్సాప్
roshan champion movie shooting begins today
షూటింగ్ అప్‌డేట్

రోషన్ ఛాంపియన్ షూటింగ్ మొదలు

శ్రీకాంత్ వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు తనయుడు రోషన్. నిర్మలా కాన్వెంట్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రోషన్ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆసినిమాలో నటనకి ఉత్తమ నటుడిగా సైమా అవార్డును సైతం గెలుచుకున్నాడు. ఆ తర్వాత అతను డాక్టర్ కె రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ చిత్రం పెళ్లి సందడి సినిమా చేసి తన ఎనర్జిటిక్ నటనతో మరోసారి మెప్పించాడు.

TFN Adminవాట్సాప్
Nidhhi Agerwal poster out from Hari Hara Veera Mallu
ఫస్ట్ లుక్

హరి హర వీరమల్లు నుండి నిధి అగర్వాల్ పోస్టర్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు వున్నాయి.అందులో హరిహర వీరమల్లు'ఒకటి.ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.ఈసినిమాలో ఇప్పటి వరకు చేయని చారిత్రాత్మక యోధుడు పాత్రలో పవన్ కనిపించనున్నారు. కొంత విరామం తర్వాత ఆగస్టు 14 నుంచి ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం యాక్షన్ దర్శకుడు స్టంట్ సిల్వ పర్యవేక్షణలో భారీ యుద్ధ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
sudheer babu new movie title and first look poster out now
ఫస్ట్ లుక్

సుధీర్ బాబు కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

ఎస్ఎంఎస్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ నైట్రో స్టార్ సుధీర్ బాబుఇన్నేళ్ల తన సినీ కెరీర్ లో ఎన్నో సినిమాలు చేశాడు. ప్రేమ కథ చిత్రంతో తొలిసారి సాలిడ్ హిట్ ను అందుకున్నాడు. ఆ తర్వాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన సమ్మోహనం సినిమాతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే ఇప్పుడు చాలా సెలక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక రీసెంట్ గానే హరోం హర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జ్ఞానసాగర్ దర్శకత్వంలో ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా మంచి విజయాన్ని అందించింది. ఇక ఈసినిమా ఓటీటీలో కి కూడా వచ్చిన సంగతి కూడా తెలిసిందే. ఓటీటీలో కూడా ఈసినిమా మిలియన్ల…

TFN Adminవాట్సాప్
upendra UI movie release update
సినిమా వార్తలు

దసరా బరిలో ఉపేంద్ర UI

కన్నడ విలక్షణ నటుడు ఉపేంద్ర తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిఫరెంట్ సినిమాలు, విభిన్నమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. కన్నడలో తనకు ఎలాంటి క్రేజ్ ఉందో.. తెలుగులో కూడా అంతే క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వస్తున్నాడు. UI అనే టైటిల్ మిడ్ 2000 బ్యాక్ డ్రాప్ లో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈసినిమా ఎప్పుడో మొదలవ్వగా ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌ల చేసిన గ్లింప్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది.

TFN Adminవాట్సాప్
producer bunny vasu about thandel movie release
సినిమా వార్తలు

తండేల్- దసరా తర్వాతే క్లారిటీ

నాగ చైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తండేల్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. మత్స్యకారుడు గణగల్ల రామరావు జీవితాన్ని ఈసినిమా ద్వారా చూపిస్తున్నారు. ఇక యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈసినిమా కోసం నాగచైతన్య తన మేకోవర్ ను పూర్తిగా మార్చేశాడు. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది.

TFN Adminవాట్సాప్
jr ntr congratulations to national award winners
సినిమా వార్తలు

నేషనల్ అవార్డ్ విన్నర్స్ కు ఎన్టీఆర్ అభినందనలు

నేడు 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. దీనిలో తెలుగు సినిమాల్లో కేవలం ఒక్క సినిమాకు మాత్రమే ఈ అవార్డ్ దక్కింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రం తెలుగు కేట‌గిరిలో బలగంతో పాటు ‘కార్తికేయ 2’, ‘మేజర్’, ‘సీతారామం’ పోటీలో నిల‌వ‌గా.. కార్తికేయ 2 ఈ అవార్డును గెలుచుకుంది. ఇక ఉత్తమ హిందీ చిత్రంగా ‘గుల్‌మోహర్’, ఉత్తమ కన్నడ చిత్రంగా ‘కేజీఎఫ్2’, ఉత్తమ తమిళ సినిమా ‘పొన్నియన్ సెల్వన్-1’ అవార్డులు గెలుచుకుంది.

TFN Adminవాట్సాప్
Double Ismart First Day Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2024,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Double Ismart Box Office Collection Day 1,Double Ismart Box Office,Double Ismart Box Office Day 1,Do
బాక్సాఫీస్

డబుల్ ఇస్మార్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్

రామ్- పూరి జగన్నాధ్ ల కాంబినేషన్ లో మచ్ అవైటెడ్ సీక్వెల్ గా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది.మిగితా సినిమాల నుండి పోటీ తట్టుకొని తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 12.45కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా ఎక్కువగానే వుంది.దాంతో రానున్న రోజుల్లో ఇదే జోరు కొనసాగించాల్సి ఉంటుంది.

Mahender Reddyవాట్సాప్
Director Harish Shankar Says I Will Watch Aay As Soon As Possible,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2024,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Narne Nithin,Aay,Aay Movie,Aay Telugu Movie,Aay Movie Updates,Aay Movi
సినిమా వార్తలు

అతి త్వరలో ఆయ్ చూస్తా -హరీష్ శంకర్

నిన్న రిలీజైన సినిమాల్లో అన్నికంటే ఎక్కవగా పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకున్న సినిమా ఆయ్.మ్యాడ్ ఫేమ్ నార్నె నితిన్ హీరోగా నటించిన ఈసినిమా గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో తెరకెక్కింది.ఇందులో కామెడీ అలాగే చివరి 20నిమిషాలుహైలైట్ అయ్యాయి.ఈసినిమా చూసినా వారందరు బాగుందని అంటున్నారు.దాంతో చిన్న సినిమా గా వచ్చిన ఆయ్ ఫుల్ రన్ లో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లను రాబట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.అంజి మణిపుత్ర ఈసినిమాను డైరెక్ట్ చేయగా గీతా ఆర్ట్స్ నిర్మించింది.

Mahender Reddyవాట్సాప్
Vikram Thangalaan Movie First Day Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2024,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Thangalaan Box Office Collection Day 1,Thangalaan Box Office,Thangalaan Box Office Day 1,T
బాక్సాఫీస్

తంగలాన్ ఫస్ట్ డే కలెక్షన్స్- నార్త్ ఇండియా రిలీజ్ డేట్ ఫిక్స్

పా రంజిత్ దర్శకత్వంలో విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా వచ్చిన సినిమా తంగలాన్. కోలార్ ఫీల్డ్స్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా ఎన్నో అంచనాల మధ్య ఆగష్ట్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. విక్రమ్ నటనకి ప్రేక్షకులతో పాటు మర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు అందుతున్నాయి

TFN Adminవాట్సాప్
Bhaira Glimpse Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2024,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Devara,Bhaira,Devara On Sep 27th,Saif Ali Khan,Saif Ali Khan Movies,Saif Ali Khan New Movie,Saif Ali Khan Telugu
ట్రైలర్ & టీజర్

దేవర నుండి భైరా గ్లింప్స్ రిలీజ్

మచ్ అవైటెడ్ మూవీ దేవర నుండి వస్తున్న అప్డేట్స్ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తున్నాయి.రీసెంట్ గా ఈసినిమా నుండి వచ్చిన సెకండ్ సింగిల్ చుట్టమల్లే సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చు కుంది.అతి తక్కువ రోజుల్లో 100మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకునే దిశగా సాగుతుంది.ఇక ఇప్పుడు మరో అప్డేట్ వచ్చేసింది.ఈసినిమాలో హిందీ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే.ఇందులో ఆయన భైరా అనే పాత్రలో కనిపించనున్నాడు.తెలుగులో తనకు ఇదే మొదటి సినిమా.ఈరోజు సైఫ్ బర్త్ డే కావడంతో భైరా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

Mahender Reddyవాట్సాప్
Karthikeya 2 Movie Wins National Award,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2024,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Nikhil Siddhartha,Nikhil Siddhartha Movies,Nikhil Siddhartha New Movie,Nikhil Siddhartha Latest M
సినిమా వార్తలు

2024 నేషనల్ అవార్డ్స్- బెస్ట్ తెలుగు చిత్రం కార్తికేయ2

ప్రతి ఏడాది నేషనల్ అవార్డ్స్ ను ప్రకటిస్తారన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈ ఏడాది కూడా 70వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించారు. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో నిర్మించిన సినిమాలను పరిగణలోకి తీసుకొని దాదాపు 11మంది జ్యూరీ సభ్యులు సినిమాలను పరిశీలించి అవార్డులను ప్రకటిస్తారు. ఈమేరకు డిసెంబర్ 31 2022 నాటికి సెన్సార్ అయిన చిత్రాల‌కు అవార్డుల‌ను అందిస్తుంది. దీనిలో భాగంగానే తాజాగా 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల జాబితాను ప్రకటించారు.

TFN Adminవాట్సాప్
Stree 2 Gets Record Opening Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2024,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Stree 2 Box Office Collection Day 1,Stree 2 Box Office,Stree 2 Box Office Day 1,Stree 2 Review,S
బాక్సాఫీస్

హిస్టరీ క్రియేట్ చేసిన స్త్రీ 2

బాలీవుడ్ మూవీ స్ట్రీ 2 చరిత్ర సృష్టించింది.సూపర్ హిట్ మూవీ స్త్రీకి సీక్వెల్ గా వచ్చిన ఈసినిమా మొదటి రోజు రికార్డు ఓపెనింగ్స్ ను రాబట్టింది.బుధవారం ప్రీమియర్స్ పడగా యునానిమస్ పాజిటివ్ రివ్యూస్ ను తెచ్చుకుంది.దాంతో నిన్న ఈసినిమా వసూళ్ల వర్షం కురిపించింది.ప్రీమియర్స్ తో 9.40కోట్ల వసూళ్లను రాబట్టగా నిన్న 55.40 కోట్లు రాబట్టింది దాంతో మొత్తం మొదటి రోజు దేశ వ్యాప్తంగా 64.80కోట్ల వసూళ్లను సొంతం చేసుకొని షారుక్ ఖాన్ పఠాన్ రికార్డును తిరగరాసింది.గత ఏడాది పఠాన్ 55కోట్ల ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది.పెద్దగా స్టార్స్ ఎవరు లేకున్నా హర్రర్ కామెడీ జోనర్ లో వచ్చిన స్త్రీ 2 ఈ రేంజ్ కలెక్షన్లను రాబట్టుకోవడం…

Mahender Reddyవాట్సాప్

షేర్