హరి హర వీరమల్లు నుండి నిధి అగర్వాల్ పోస్టర్ రిలీజ్ 

Nidhhi Agerwal poster out from Hari Hara Veera Mallu

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు వున్నాయి.అందులో  హరిహర వీరమల్లు’ఒకటి.ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.ఈసినిమాలో ఇప్పటి వరకు చేయని చారిత్రాత్మక యోధుడు పాత్రలో పవన్ కనిపించనున్నారు. కొంత విరామం తర్వాత ఆగస్టు 14 నుంచి ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం యాక్షన్ దర్శకుడు స్టంట్ సిల్వ పర్యవేక్షణలో భారీ యుద్ధ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

ఇక ఇప్పుడు చిత్ర బృందం మరో అప్డేట్ ఇచ్చింది.ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్ననిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఆమె పోస్టర్ ను రిలీజ్ చేసి విషెస్ తెలిపారు. పోస్టర్‌లో నిధి ట్రెడిషనల్ లుక్ లో కనిపించి అదరగొట్టింది.అణగారిన వర్గాల కోసం పాలకుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడే ఒక యోధుడిగ కథతో తెరకెక్కుతుంది ఈసినిమా. 

యువ దర్శకుడు జ్యోతి కృష్ణ డైరెక్షన్ లో వస్తున్న ఈసినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ సహా అనేక మంది ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా,లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి ఈ చిత్రం కోసం అద్భుతమైన సెట్ లను రూపొందిస్తున్నారు.ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

లెజెండరీ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.ఈ చిత్రం రెండు భాగాలుగా రానుండగా మొదటి భాగం హరి హర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ త్వరలో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు,హిందీ, తమిళ,మలయాళ భాషల్లో విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.