శ్రీకాంత్ వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు తనయుడు రోషన్. నిర్మలా కాన్వెంట్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రోషన్ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆసినిమాలో నటనకి ఉత్తమ నటుడిగా సైమా అవార్డును సైతం గెలుచుకున్నాడు. ఆ తర్వాత అతను డాక్టర్ కె రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ చిత్రం పెళ్లి సందడి సినిమా చేసి తన ఎనర్జిటిక్ నటనతో మరోసారి మెప్పించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు రోషన్. ఛాంపియన్ అనే టైటిల్ తో ఈసినిమా రాబోతుంది. ఈసినిమా ఫస్ట్ లుక్ ను రోషన్ పుట్టినరోజు అప్పుడు రిలీజ్ చేశారు. ఇప్పుడు చాలా రోజుల తరువాత ఈసినిమా నుండి అప్ డేట్ తో వచ్చారు మేకర్స్. ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నట్టు తెలిపారు మేకర్స్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో ‘కల్కి 2898 ఏడీ’ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టి మూవీ షూటింగ్ ను ప్రారంభించినట్లుగా కనిపిస్తోంది.
ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో వస్తున్న వైజయంతీ మూవీస్, స్వప్నా సినిమా సంయుక్తంగా ఈసినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించనున్నారు. సుధాకర్ రెడ్డి యక్కంటి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు. ఈసినిమాలో నటించే నటీనటులకు సంబంధించిన వివరాలను త్వరలో తెలియచేయనున్నారు..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























