ఎస్ఎంఎస్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ నైట్రో స్టార్ సుధీర్ బాబుఇన్నేళ్ల తన సినీ కెరీర్ లో ఎన్నో సినిమాలు చేశాడు. ప్రేమ కథ చిత్రంతో తొలిసారి సాలిడ్ హిట్ ను అందుకున్నాడు. ఆ తర్వాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన సమ్మోహనం సినిమాతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే ఇప్పుడు చాలా సెలక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక రీసెంట్ గానే హరోం హర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జ్ఞానసాగర్ దర్శకత్వంలో ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా మంచి విజయాన్ని అందించింది. ఇక ఈసినిమా ఓటీటీలో కి కూడా వచ్చిన సంగతి కూడా తెలిసిందే. ఓటీటీలో కూడా ఈసినిమా మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టేశాడు. వెంకట్ కళ్యాణ్ దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది. ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి కొత్త అప్ డేట్ తో వచ్చారు. ఈసినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాకు జటాధర అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. షర్ట్ లేకుండా సిక్స్ ప్యాక్ తో నించుని త్రిశూలం చేత పట్టుకుని ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటుంది.
కాగా ఈసినిమాను శివిన్ నారంగ్, ప్రేర్ణ అరోరా నిర్మిస్తున్నాడు. సుధీర్ బాబు సమర్పకుడుగా వ్యవహరిస్తున్నాడు. త్వరలోనే ఈసినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. అంతేకాదు ఈసినిమాను 2025 మహా శివరాత్రికి విడుదల చేయనున్నట్టు కూడా ఇప్పటికే ప్రకటించడం విశేషం. ఇంకా తెలుగుతో పాటు హిందీలోనూ ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























