కన్నడ విలక్షణ నటుడు ఉపేంద్ర తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిఫరెంట్ సినిమాలు, విభిన్నమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. కన్నడలో తనకు ఎలాంటి క్రేజ్ ఉందో.. తెలుగులో కూడా అంతే క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వస్తున్నాడు. UI అనే టైటిల్ మిడ్ 2000 బ్యాక్ డ్రాప్ లో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈసినిమా ఎప్పుడో మొదలవ్వగా ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా రిలీజ్ గురించి ఫ్యాన్స్ ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. అయితే రిలీజ్ డేట్ పై ఇంతవరకూ క్లారిటీ మాత్రం రాలేదు. ఇక ఇప్పుడు చాలా రోజులు తరువాత మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ తో వచ్చారు మేకర్స్ తాజాగా మూవీ విడుదల అప్‌డేట్‌ను ఇచ్చారు. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా స్పెషల్ వీడియోను విడుదల చేశారు. వీడియో ఆకట్టుకుంటుంది. ఉపేంద్ర డెమి గాడ్‌గా ఫిరోషియస్ లుక్‌లో అలరిస్తున్నాడు.
కాగా హీరోగా నటిస్తూనే ఉపేంద్ర ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈసినిమాలో రేష్మ, మురళీ శర్మ, నిధి సుబ్బయ్య, రవి శంకర్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ భారీ పాన్ ఇండియా యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీని లహరి ఫిలింస్ ఎల్ఎల్పీ, వీనస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా .జి. మనోహరన్, శ్రీకాంత్ కెపి నిర్మిస్తున్నారు. కాంతర ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ విడుదల చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























