శివాజీ-లయ హిట్ కాంబినేషన్ రిపీట్

Actors Sivaji and Laya Hit Combination Returns For A New Film

ప్రముఖ నటుడు శివాజీ మళ్ళీ సినిమాలలో బిజీ అవుతున్నారు. గత బిగ్ బాస్ సీజన్ 7లో ప్రధాన కంటెస్టెంట్‍గా శివాజీ మంచి గుర్తింపు సాధించాడు. అనంతరం ఆయన ప్రధానపాత్రలో నటించిన ’90’s’ వెబ్ సిరీస్‌లో నటించి హిట్ అందుకున్నారు. తాజాగా ఆయన, ఒకప్పటి స్టార్ హీరోయిన్ లయ హీరోహీరోయిన్లుగా ఓ సరికొత్త క్రైమ్ కామెడీ థ్రిల్లర్ రూపుదిద్దుకుంటోంది. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నం.2గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి నిర్మాత కూడా శివాజీ కావడం గమనార్హం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రానికి సంబందించిన పూజ కార్యక్రమాలు ఇటీవలే నిర్వహించారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు క్లాప్ కొట్టగా, శివాజీ కుమారుడు రిక్కీ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్, దిల్ రాజు మరియు దర్శకులు బోయపాటి శ్రీను చేతుల మీదుగా స్క్రిప్ట్ ని అందుకోగా, ఫస్ట్ డైరెక్షన్ బోయపాటి శ్రీను చేసారు. ఈ సినిమాతో సుధీర్ శ్రీరామ్ అనే దర్శకుడు తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం కాబోతున్నారు. ఈ నెల 20 నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

కాగా ఇంతకు ముందు శివాజీ, లయ కాంబినేషన్‌లో ‘మిస్సమ్మ’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’, మరియు ‘అదిరిందయ్యా చంద్రం’ సినిమాలు వచ్చాయి. ఇవి బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడమే కాకుండా ఇద్దరికీ హిట్ పెయిర్ అనే ట్యాగ్‍ని కూడా అందించాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ 14 ఏళ్ల తరువాత వీరిరువురు జంటగా నటించనుండటంతో, అటు పరిశ్రమలో ఇటు ప్రేక్షకుల్లో యెనలేని ఆసక్తి నెలకొంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.