చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వచ్చిన సినిమా కార్తికేయ2 ఎంత సంచలన విజయం సాధించిందో చూశాం. కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా ఈసినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈసినిమా భారీ కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ద్వారక నేపథ్యంలో కృష్ణుని కంకణం కథాంశం ఆధారంగా తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ అందరినీ ఆకట్టుకుంది. కేవలం తెలుగు ప్రేక్షకులనే కాదు నార్త్ అడియెన్స్‌కు కూడా నచ్చేసింది. నచ్చడమే కాదు నార్త్ లో కూడా తన సత్తా చాటి సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాకు తాజాగా నేషనల్ అవార్డ్ సైతం దక్కిన సంగతి తెలిసిందే కదా. బెస్ట్ ప్రాంతీయ చిత్రంగా ఈసినిమాకు నేషనల్ అవార్డ్ దక్కింది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ కు అందరి నుండీ అభినందనలు దక్కాయి. ఇదిలా ఉండగా కార్తికేయ2 హిట్ తరువాత కార్తికేయ3 కూడా చేయాలని మేకర్స్ చూస్తున్న సంగతి విదితమే. కార్తికేయ2 ప్రమోషన్స్ అప్పుడే చందూ మొండేటి ఇంకా నిఖిల్ కూడా కార్తికేయ3 ఉంటుందని చెప్పారు. ఇప్పుడు తాజాగా మరోసారి దీనిపై మరోసారి క్లారిటీ ఇచ్చారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. కార్తికేయ 3 ప్లాన్స్ ఇప్పటికే జరుగుతున్నాయి.. చందూ మొండేటి స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నారు అని తెలిపారు. ఈసినిమాను వచ్చే ఏడాది ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది.
కాగా కార్తికేయ2 ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా.. అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనన్, వైవా హర్ష, శ్రీనివాస్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ పతాకాల పై సంయుక్తం గా నిర్మించిన ఈసినిమాకు కాల భైరవ సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: