మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రామ్- పూరి జగన్నాధ్ ల కాంబినేషన్ లో మచ్ అవైటెడ్ సీక్వెల్ గా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది.మిగితా సినిమాల నుండి పోటీ తట్టుకొని తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 12.45కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా ఎక్కువగానే వుంది.దాంతో రానున్న రోజుల్లో ఇదే జోరు కొనసాగించాల్సి ఉంటుంది.
ఈసినిమాలో రామ్ ఎనర్జిటిక్ యాక్టింగ్ గురించి సోషల్ మీడియా లో ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇందులో రామ్ వన్ మ్యాన్ షో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.కావ్య థాపర్ ఈసినిమాలో హీరోయిన్ గా నటించగా సంజయ్ దత్ విలన్ రోల్ లో కనిపించాడు.మణిశర్మ సంగీతం అందించాడు.పూరి కనెక్ట్స్ బ్యానర్ ఫై పూరి జగన్నాధ్,ఛార్మి ఈసినిమాను నిర్మించారు.
ఇక రామ్ ఈసినిమా తరువాత తను నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడని ఆసక్తిగా మారింది.మొదటి సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తో సూపర్ హిట్ కొట్టిన యంగ్ డైరెక్టర్ మహేష్ బాబు పి,రామ్ నెక్స్ట్ సినిమా చేయనున్నాడని రీసెంట్ గా వార్తలు వచ్చాయి.అయితే ఇప్పటివరకు ఈసినిమా గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం బయటికి రాలేదు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: